ఆగిన గుండెను తట్టి లేపుతరా -నిజమా !

హార్ట్ బీట్ ను సరి చేసే పేస్ మేకర్లు ----

మీకు పూర్తిగా అర్ధం కావాలంటే ఇక్కడ ఒక కధ చెప్పాలి.ఐ సి యు లో ఒక్క సారిగా గుండె ఆగిపోయిన హీరో. ఆందోళన లో వారి కుటంబ సభ్యులు.ఉత్కంట తో ప్రేక్షకులు --హడావిడిగా డాక్టర్స్ చక చకా పరుగెడుతున్నారు. ఏమయ్యిందో అని కుటుంబీకుల ఆందోళన. దేవుళ్ళకు మొక్క్కుకుంటుంది స్వామీ నాభర్త కోలుకుంటే కాలినడకన తిరుపతి వస్తాను అని మొక్కులు మొక్కుతారు. రక్త సంబంధం తల్లి తల్లడిల్లి పోతూ ణా కొడుకుని కాపాడు అంటు తన బిడ్డ ప్రాణం కోసం తల్లడిల్లి పోతుంది. ఇక్కడ డాక్టర్స్ ఐ సి యు లో ఒక ప్రత్యేక పరికరం తో చాతి పై ఒత్త్జిడి కలిగిస్తున్నారు.కాసేపటికి హీరో గుండె తిరిగి కొట్టుకుంటుంది . హీరో బతికాడు ప్రాణాపాయం తప్పింది. మీరు వెళ్లి చూడచ్చు అంటు డాక్టర్స్ చెప్పడం. వెంటనే కుటుంబ సభ్యులు బాబూ అంటూ ఏడుపులు పెడబొబ్బలునువ్వు బతికావు మాకు అంతే చాలు అనుకుంటూ ఆనంద బాష్పాలు రాలుస్తారు. ఇది కధ మాత్రమే కాదు వాస్తవంగా మనము ఆసుపత్రులలో చూసే సన్నీ వేసాలే కాని కాని కల్పితం కాదు వాస్తవం.అసలు ఇక్కడ మనము గ్రహించాల్సిన విషయం ఏమిటి అంటే ఒక్కసారిగా గుండె ఆగి పోవడానికి కారణం ఏమిటి అని మాత్రమే?భయం తో ఉన్నప్పుడో ,వేగంగా పరుగేత్తినప్పుడో గుండె వేగంగా కొట్టుకోవడం కొంచం ఆయాస పడడం సహజమే కానీ ఇవి ఏ వి కాకుండా లేకుండానే ఒక్కోసారి గుండె వేగంగా నిమిషానికి 2౦౦ సార్ల కు పైగా కొట్టుకుంటుంది.

ఎందుకు ఇలా...? 

ఉదాహరణకు పోవడమో లేదా ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపోవడమో, లేదా  స్విచ్ వేయగానే విద్యుత్ పరికరం పనిచేయక పోవడమో లేదా విద్యుత్ సరఫరా అందక వస్తువులు పాడయ్యి పోవడం లేదా లేదా షాట్ సర్క్యూట్ అయ్యిందని అనుకుంటాము దీనిక్శ్రానం గా ఒక్కో సారి విద్యుత్ పరికరాలు కాలిపోవడ మూ జరుగుతుంది. సరిగ్గా అలాగే మన గుండే లో కూడా జరుగుతాయి. గుండెలో కూడా విద్యుత్ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. ఇది విద్యుత్ ప్రేరణ లను ఉత్పత్తి చేయడం వల్లనే గుండె లబ్ డబ్ అంటూ కొట్టు కుంటూ ఉంటుంది. అది అలా కొట్టు కుంటేనే రక్తం ఊపిరి తిత్తుల నుంచి గుండెకి అక్కడి నుంచి శరీర భాగాలకు రవాణా కాగలదు. గుండె ఇలా కొట్టుకోవడా న్నే హృదయ స్పందనలు అని అంటారని అపోలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ ఎ శ్రీనివాస్ తెలుగు వన్ కు వివరించారు.గుండె సర్జరీల పై సమగ్ర అవగాహన ఉన్న డాక్టర్ శ్రీనివాస్ ఈ అంశాల పై పూర్తి అద్యయనం చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా సాధారణంగా మనిషి గుండె 7౦ నుండి 8౦ సార్లు కొట్టుకున్యుంది. హృదయ స్పందనల రేటు 6౦ నుండి 1౦౦ సార్లు కొట్టు కోవడం కూడా నార్మల్ రేంజ్ ఇంతకన్నా ఎక్కువో తక్కువో ఉన్నప్పుడు సమస్య ఉన్నట్లు మనం వ్యాయామం చేసినప్పుడు పరుగేత్తినప్పుడు ఒత్తిడిలో ఉన్నప్పుడు ,భావోద్వేగాలకు  లోనై నప్పుడు ఈ స్పందనల వేగం పెరుగుతుంది. అయితే గుండెలో ఉండే విద్యుత్ వలయా ల్లో తేడా లు ఏర్పడినప్పుడు షార్ట్ సర్క్యూట్ లు అయినప్పుడు గుండె కొట్టుకునే రేటులో కూడా మార్పు వస్తుంది. హార్ట్ బీట్ లో ఈ ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు మాత్రమే హార్ట్ బీట్ లో సమస్యలు వస్తాయి.పైన పేర్కొన్న సమస్యలకు మూలకారణాలు ఇవే.

గుండె హార్ట్ బీట్ ను బట్టి అవి ఎవిభాగానికి చెందినవో ఎలా నిర్ధారిస్తారు?....

గుండె రేటు తగ్గితే బ్రాడ్ కార్దియా....

సాధారణ స్థాయి కన్నా చాలా తక్కువ స్థాయికి హృదయ స్పందన రేటు పడిపోయి నప్పుడు నిమిషానికి 6౦ కన్నా తక్కువగా గుండె కొట్టు కుంటుంది.ఈ సమస్యను బ్రాడ్ కార్దియా అంటారు. దీనివల్ల కళ్ళు తిరిగి పది పోతారు. ఈ సమస్య ఉన్నప్పుడు గుండెకు తగినంత విద్యుత్ ప్రవహించదు.దాని వల్ల విద్యుత్ ప్ర చొదనాలు తగినన్ని ఏర్పడక గుండె కొట్టుకునే వేగం తగ్గిపోతుంది. పొటాషియం, కాల్షియం, లాంటి లవణా లలో మార్పులు కిడ్నీ,ధై  రాయిడ్ , లాంటి సమస్యలు కొన్ని రకాల మందులు బిపి గుండె జబ్బులు, ఇందుకు కారణం కావచ్చు.కొన్ని సందర్భాలాలో ప్రత్యేకంగా ఏ కారణం లేకుండా కూడా రావొచ్చు.

బీట్ ఎక్కువైతే టాకీ కార్దియా....

హృదయ స్పందనలు రేటు నిమిషానికి 7౦ నుండి 8౦ ఉండాల్సింది చాలా ఎక్కువ అవుతుంది. నిమిషానికి 1౦౦ కన్నా ఎక్కువ సార్లు అత్యంత వేగంగా కొట్టుకుంటుంది దీన్ని టాకీ కార్డియా అంటారు దీని వల్ల గుండె దాదా అలసట కళ్ళు తిరగడం, హృదయ స్పందనలు ఒక క్రమ పద్దతిలో ఉండకుండా అసాధారణంగా ఉంటాయి. అదనపు విద్యుత్ వలయాలు ఏర్పడడం వల్ల ఇలా జరుగుతుంది. దీనికి కారణం పుట్టుకతోనే ఉండొచ్చు. లేదా వయసు రీత్యా వచ్చే మార్పులు భాగంగా విద్యుత్ ప్రచోదనా లలో తేడా రావచ్చు. ఇలా అదనపు విద్యుత్ వలయాలు ఏర్పడి. గుండె కొట్టుకునే వేగం పెరగడం వల్ల గుండె లోపల శోఇర్ట్ సర్క్యూట్ అవుతుందని డాక్టర్ శ్రీనివాస్ విశ్లేషించారు.

లీడ్ లెస్ పేస్ మేకర్లు --రకాలు....

మామూలుగా కొత్త ద్వారా పేస్ మేకర్ అమరిస్తే లీడ్ పేస్ మేకర్ పి పి ఐ -పేస్ మేకర్ ఇంప్లాన్ టేషన్ అంటారు. కోత  లేకుండా అమర్చే పేస్ మేకర్ ను లీడ్  లెస్ పేస్ మేకర్ అంటారు. వీటిలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. కర్ణి కల సంకోచం 2౦% జటరికల సంకోచం శాతాని బట్టే గుండె పంపింగ్ సామర్ధ్యం ఆధార పది ఉన్యుంది. పేస్ మేకర్ అమర్చడం ద్వారా కర్ణికల 2౦% జట్ట రికల 8౦% సంకోచం కలిపి మొత్తం వంద శాతం శాతం జరిగే టట్లు గా చూస్తారు. లేదా కనీసం 8౦% జటరికల్ సంకోచం జరిగే తట్టుగా అయినా చూస్తారు.అంటే కనీసం 8౦% అయినా గుండె పంపింగ్ సామర్ధ్యం ఉండేలా చికిత్స చేస్తారని డాక్టర్ శ్రీనివాస్ వివరించారు.

రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషణ్....

టాకీ కార్టియా సమస్యకు చేసే పరీక్షలో భాగం గా గుండె లోపలి విద్యుత్ వ్యవస్థను విశ్లేషిస్తారు. గుండె ఇ సి జి ని లోపలి భాగం నుంచి తీస్తారు.అంటే తోడ భాగం నుంచి కేధడర్ ద్వారా రక్త నాళం లోకి వైర్లను గుండె దగ్గరకి పంపి. గుండె లోపల దాని ఇ సి జి ని తీస్తారు. ఈ ఎలక్ట్రో ఫిజియా లజీ అధ్యనాలద్వారా అదనపు అసాధారణపు విద్యుత్ వలయం ఎక్కడుందో అధిక కనిపెట్ట వచ్చు. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషణ్ ద్వారా అదనపు విద్యత్ వలయాన్ని తొలగిస్తారు.అసాధారణం గా అదనం గా ఏర్పడిన విద్యుత్ వలయానికి అధిక ఫ్రీక్వెన్సీ కలిగిన రేడియో ఫ్రీక్వెన్సీ పంపించడం ద్వారా ఎక్కువ ఉష్ణోగ్రత వెలువడి ఆవలయం దెబ్బతింటుంది. త్స్ద్వారా వలయం తెగిపోతుంది. అందువల్ల సమస్య తగ్గు తుంది. ఈ పద్దతిలో లోకల్ ఎనేస్తీషియా ఇస్తే సరిపోతుంది ఆపరేషన్ కి రెండు గంటలు పడుతుంది.ఒకరోజు ఆసుపత్రిలో ఉండాల్సి రావచ్చు.

బీటింగ్ మారితే పేస్ మేకర్ తో సరి....

హృదయ స్పందనలో తేడాలు ఉన్నప్పుడు పేస్ మేకర్ అనే పరికరాన్ని అమర్చడం ద్వారా బీటింగ్ నార్మల్ స్థాయికి వచ్చేట్లు గా చేస్తారు. పేస్ మేకర్లలో చాలా రకాలు ఉన్నాయి అయితే రోగి వయస్సు ఆరోగ్య పరిస్థితులను బట్టి సరైన దాన్ని ఎంచుకుంటారు. ఇందుకోసం లోకల్ అనెస్తీషియా చాలు అనుఇ భుజం ఎముక క్లావికల్ కింద అనేస్తిషియా ఒక కొత్త పెట్టి చర్మం కింద పేస్ మేకర్ ని అమరుస్తారు. పేస్ మేకర్ గుండె కొట్టుకోడానికి కావాల్సిన కావాల్సిన విద్యుత్ ప్రచోదనలను అందిస్తుందని దీనిలోని వైర్లు గుండె స్పందనని ప్రేరేపిస్తాయి. ఇప్పుడు వైర్లు లేకుండా ఆ చిన్న కొత్త కూడా అవసరం లేకుండా కూడా పేస్ మకేర్ ను అమరుస్తున్నారు.

సింగల్ చాంబర్ పేస్ మేకర్....

కుడి జటరిక కండరం లో ఆర్ ఎ అపెండేక్స్ ఒక్క చోటే లీడ్ వైరు అవసరం లేకుండా పేస్ మేకర్ ను అమరిస్తే సింగిల్ చాంబర్ పేస్ మేకర్ అంటారు. ఎన్ ఎ నోఇద్ అవసరం లేకుండా విద్యుత్ ప్రేరణలు అక్కడే పెట్టి జతరికలు సంకోచించేందుకు ప్రేరణ కలిగిస్తాయి. ఈ ప్రక్రియ ద్వారా గుండె 8౦% సంకోచం చెందుతుంది. అసాధారణం గా వయస్సు ఎక్కువగా ఉన్న వాళ్ళకు కనీసం 8౦ %అయినా గుండె సామర్ధ్యం ఉండాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళకు ఎక్కువగా ఈ ప్రక్రియ ద్వారా పేస్ మేకర్ ను అమరుస్తారు.

తాత్కాలిక పేస్ మేకర్....

శాశ్వత పేస్ మేకర్ ను అమర్చడానికి ముందు దీనిని అమరుస్తారు. అంటే శాశ్వత పేస్ మేకర్ అమర్చెంత వరకూ గుండె ఆగి ఆగిపో కుండాఉండడం కోసం తాత్కాలిక పేస్ మేకర్ ను అమరుస్తారు. మెడ లేదా కాలి రక్త నాళా ల గుండా లీడ్ ను పంపిస్తారు. దీనిని శరీరం బయటి నుంచి అమర్చి ఉన్న పేస్ మేకర్ కు అనుసంధానం చేస్తారు.అకస్మాతుగా గుండె స్పందన  వేగం తగ్గిపోవడం గుండె పోటు రావడం లాంటి సమస్యలు ఉన్నప్పుడు. కూడా పేస్మేకర్ వేస్తామని హృద్రోగ నిపుణులు డాక్టర్ ఎ శ్రీనివాస్ స్పష్టం చేసారు. ఇది అమార్చిన తరువాత సమస్య తగ్గితే ఇక శాశ్వత పేస్ మేకర్ అమర్చే అవసరం ఉండదు. అంటారు శ్రీనివాస్. ఇందు కోసం పొటాషియం,కాల్షియం,వంటి లవణాల లో మార్పులు కిడ్నీ ధై రాయిడ్ లాంటి సమస్యలు మందుల వంటి సెకండరీ కారణాలు ఉన్నప్పుడు తాత్కాలిక పేస్ మేకర్ తో సమస్య పోగొట్టవచ్చు. అప్పుడు శాశ్వత పేస్ మేకర్ తప్పనిసరిగా అవసరం అవుతుంది.

డ్యుయల్ చాంబర్ పేస్ మేకర్ డి డి డి ఆర్....

దీనిలో రెండు లీడ్స్ ను ఉపయోగిస్తారు.ఒక లీడ్ ను ఎన్ ఎ నోడ్ దగ్గర అంటే కుడి కర్ణిక ఱేణ్డాళేఆడ్ కుడి జటరిక కండరం లోకి అమరుస్తారు. ఈ విధానం లో వంద శాతం పంపింగ్ పునరుద్దరింప బడుతుంది. అంటే నార్మల్ గా సహజం గా ఆరోగ్యంగా ఉన్న గుండె కొట్టు కున్నట్లే ఇప్పుడు కూడా కొట్టుకుంటున్ దన్న మాట.కర్ణికలు,జటరికలు కలిసి వంద శాతం సంకోచం బీటింగ్ ఉంటుంది. కాబట్టి పంపింగ్, ఫంక్షనింగ్ కూడా వంద శాతం ఉంటుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి చాలా సందర్భాలాలో సింగిల్ చాంబర్ పేస్ మేకర్ అమరుస్తారు.బై వెంత్రి క్యులర్ పెసింగ్ బి ఐ వి పి పై న వివరించిన రెండు లేఅడ్స్ తో పాటు గా మూడవ లీడ్ ను కూడా దీనిలో అమరుతారు. మూడవ లీడ్ ను కరోనరీ సైనస్ ద్వారా  ఎడమ జటరిక లోకి నేరుగా అమ్రుస్తారని తెలిపారు. అప్పుడు విద్యుత్ వ్యవస్థ దాన్ని ప్రేరేపించి అది సంకోచించేలా చేస్తుందని పేర్కొన్నారు. రెండు వెంట్రికల్స్ జటరికలు ఒకే సారి సంకోచించ దానికి ఇది ఉపయోగ పడుతుంది. కొన్ని సార్లు కర్ణికలు, జటరికలు  వేరు వేరు   సమయాలలోసంకోచిస్తాయి. ఇలాంటప్పుడు రెండింటి మధ్య సమన్వయం. ఉండదు. తద్వారా పంపింగ్ తగ్గిపోతుంది. అందుకే వీటిని సమన్వయ పరిచి రెండూ ఒకేసారి సంకోచిం చేలాచేయడానికి బి ఐ వి పి చేస్తారు.

పవర్ జనరేట్ --ఎన్ ఎ నోడ్...

గుండె ఇలా కొట్టుకోడానికి ఒక ప్రేరణ కావాలి ఈ ప్రేరణ విద్యుత్ అయస్కాంత తరంగాల ద్వారా వస్తుంది. గుండెలో ఉండే ఎన్ ఎ నోడ్ దీనికి కేంద్రబిందువు దీన్నే సైనో ఎంట్రి యల్ 
నోడ్ అంటారు. ఇది కుడి కర్ణిక రైట్ ఎంట్రి యం లోపల ఉంటుంది. ఇక్కడి నుంచి విద్యుత్ ప్రేరణలు ఉత్పత్తి అవుతాయి అందుకే దీనిని పవర్ జనరేటర్ అంటారు.ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్ ప్రేరణలు కుడి జతరిక అపెక్స్ లో ఉన్న ఎ వి నోడ్ ఏ ట్రీ వెంట్రీ క్యులర్ నోడ్ దగ్గరికి చేరుతాయి.ఇక్కడ నుండి బండిల్ ఆఫ్ హిస్,తరు వాత పర క్యునే ఫైజర్లకు వాటి నుంచి గుండె కండరానికి ఈ ప్రేరణలు చేరుతాయి అప్పుడే గుండె కండరం ప్రేరణ చెంది సంకోచిస్తుంది. ఈ వలయం లో ఎక్కడ సమస్య ఉన్నా హృదయ స్పందన ల్లో తేడాలు వస్తాయని శ్రీనివాస్ విశ్లేషించారు.ఎన్ ఎ నోడ్ దగ్గర ఫైబ్రో సిస్ ఉంటె సి క్ సైనస్ సిండ్రోం అంటారు. ఎ వి నోడ్ దగ్గర ఫై బ్రోసిస్ ఉంటె ఎ వి బ్లాక్ అనీ దీనిని హార్ట్ బ్లాక్ అని అంటారని పేర్కొన్నారు .

ఆగిన గుండెకు డీ ఫైబ్రి  లే టర్....

గుండె పొట్ల వల్ల గుండె కండరం తో పాటు గా విద్యుత్ వలయాలు కూడా దెబ్బ తినచ్చు. తద్వారా షార్ట్ సర్క్యూట్ ఏర్పడు తుంది.దీన్ని వెంట్రీ క్యులార్ టాకీ కార్టీ యా అంటారు. ఇలాంటి సమయం లో అకస్మాతుగా పది పోతే వెంటనే హాస్పిటల్ కు తీసుకు వెళ్ళాలి . వీలై నంత త్వరగా చికిత్స ప్రారంభించాలి హాస్పిటల్ లోనే డీ ఫైబ్రి లెటర్ ద్వారా గుండెపై ఒత్తిడి కలిగిస్తూ ఆగిన గుండెను తట్టి లేపుతారు ఇప్పుడు ఇప్పుడు ఇంప్లాన్ టబుల్ డీ ఫైబ్రి లెటర్లు కూడా అందు బాటులో ఉన్నాయి.వీటిని చర్మం కింద అమరుస్తారు. గుండెలో షార్ట్ సర్క్యూట్ అయిన వెంటనే ఇది గుర్తిస్తుంది.అంతే కాక షాట్స్ ఇస్తూ సర్క్యూట్ ను పోగొడుతుంది.కూడా గుండె బలహీనం గా ఉన్న వాళ్ళకు ఇలా షార్ట్ సర్క్యూట్ అయ్యే వాళ్ళకు ఎలక్ట్రో ఫిజియాలజీ పరీక్షలు చేస్తే వాళ్ళకు ఇలా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఎ మేరకు ఉందొ తెలిసిపోతుంది రిస్క్ ఉందని అంకున్నపౌడు ముందుగానే ఈ ఇంప్లాంటబుల్ డీ ఫైబ్రి లెటర్ ను అమర్చ వచ్చు. ఈ చికిత్స లన్నీ కూడా కొతలేకుండా తోడ రక్తనాళం ద్వారా పంపించి చేయగల ఆధునిక వైద్య పరిజ్ఞానం అన్బాతులో ఉంది.

కాంబో డి వైస్ బి ఐ వి పి -ఎ ఐ సి డి....

గుండె కండరం చెడి పోయినా  కండరం లో స్కార్  ఏర్పడినా,ఫైబ్రోసిస్ ఉన్నా డీ ఫై బ్రి లెటర్ అమర్చవచ్చు. ఫై బ్రోసిస్ తో పాటు మాయో కార్దియం గుండె కండరం దెబ్బతిని ,బీటింగ్ అబ్నార్మల్ గా ఉన్నా హృదయ స్పందనలో తేడాలు ఉంది పంపింగ్ కూడా తక్కువగా ఉంటె కాంబో డివైస్ పెడతారు అంటే బై వెంట్రీ  క్యులర్ పెసింగ్ డీ ఫైబ్రి లెటర్ రెండూ కలిసి ఉన్న డివైస్ ని అమరుస్తారు.             
 

డయాబెటిక్ ఫుడ్స్.. ఈ ఆహారాలు తింటే చాలా ఈజీగా షుగర్ వచ్చేస్తుంది..!

రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం.   కేవలం తీపి పదార్థాలు,  స్వీట్లు, పంచదార వంటివి తినడమే డయాబెటిస్ కు కారణం అనుకుంటే పొరపడినట్టే.. రోజువారీ ఆహారపు అలవాట్ల మీద డయాబెటిస్ ముడిపడి ఉంటుందని వైద్యులు అంటున్నారు. రోజు వారి తీసుకునే కొన్ని ఆహారాలు.. ఇవి ఏం చేస్తాయి లే అనుకునే పదార్థాలు టైప్-2 డయాబెటిస్ కు కారణం అవుతాయని అంటున్నారు వైద్యులు.  ఈ ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్ ఈజీగా వస్తుందట. డయాబెటిస్ కు కారణమయ్యే ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. డీప్ ఫ్రైడ్ స్నాక్స్.. సమోసాలు, పకోడాలు,  చిప్స్  ఇవన్నీ చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు చాలా ఇష్టమైన స్నాక్స్.  కానీ ఈ ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వు క్రమంగా శరీరంలో పేరుకుపోతుంది.  బరువు పెరగడానికి దారి తీస్తుంది. బరువు పెరగడం  ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది, ఇది టైప్ 2 డయాబెటిస్‌కు ప్రధాన కారణం. ఫాస్ట్ ఫుడ్‌లో ఉపయోగించే నూనెను  పదే పదే వేడి చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్ ఏర్పడుతుంది. ఇది రక్తంలో చక్కెరను మరింత పెంచుతుంది. మార్కెట్ ఫుడ్స్.. మార్కెట్లో అమ్మే గ్రానోలాతో పాటు  అనేక బ్రేకఫాస్ట్  తృణధాన్యాలు ఆరోగ్యకరమైనవని అనుకుంటారు.   కానీ వాటిలో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.  గ్రానోలా బార్‌లు, ఓట్ బార్‌లు,  రెడీ టూ ఈట్ ఫుడ్స్ లో చాలా ఎక్కువ మొత్తంలో చక్కెరలు ఉంటాయి. వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వేగంగా పెరుగుతాయి. ప్రాసెస్డ్ మీట్.. సాసేజ్, బేకన్,  సలామీ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో సోడియం,  నైట్రేట్లు అధికంగా ఉంటాయి.  ఇవి గుండెకు హాని చేయడమే కాకుండా   డయాబెటిస్‌కు నేరుగా కారణం అవుతాయి. ప్రాసెస్ చేసిన మాంసాలు వాపును పెంచుతాయి,  జీవక్రియను నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడం కష్టతరం చేస్తాయి. డ్రింక్స్.. శీతల పానీయాలు,  ప్యాక్ చేసిన సోడాలలో చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక సోడా డ్రింక్ లో  ఉండే చక్కెర పరిమాణం కొన్ని  రోజులు తీసుకునే నేచురల్  చక్కెర కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పానీయాలు వెంటనే రక్తంలో గ్లూకోజ్‌ను పెంచుతాయి.  క్లోమంపై  ఒత్తిడిని ఎక్కువగా  కలిగిస్తాయి. ఇలాంటి డ్రింక్స్ తీసుకున్న ప్రతి  సారి  శరీరం అదనపు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇది కాలక్రమేణా ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. రిపైండ్ ఫ్లోర్,  బ్రెడ్.. తెల్ల బ్రెడ్, బన్స్, కుకీలు,  నాన్ వంటి ఆహారాలు మైదాతో తయారు చేస్తారు. ఈ ఆహారాలలో గ్లూకోజ్ చాలా త్వరగా విచ్చిన్నమవుతుంది. ఈ రిఫైండ్ ఫ్లోర్ లో  ఫైబర్ ఉండదు.  దీని వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల శరీరం రక్తంలో చక్కెర సమతుల్యతను కాపాడుకోవడానికి కష్టపడి పనిచేయవలసి వస్తుంది. ఈ అలవాటు క్రమంగా మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. వైట్ రైస్.. తెల్ల బియ్యం భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగం. కానీ ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే.  ఇది తిన్న తర్వాత గ్లూకోజ్‌గా మారుతుంది. ఇది నేరుగా రక్తంలో చక్కెరను పెంచుతుంది. రోజూ పెద్ద మొత్తంలో తెల్ల బియ్యం తినడం వల్ల బరువు పెరగడం,  రక్తంలో చక్కెర నియంత్రణ బలహీనపడటం జరిగి, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా చాలా పాలిష్ పట్టిన బియ్యంతో వండే అన్నం ఎక్కువ తినడం మానేయాలి.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

టీతో పాటు బిస్కెట్లు తింటున్నారా? దిమ్మ తిరిగే నిజాలు ఇవి..!

భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం ఈ టీ-బిస్కెట్ కాంబినేషన్ ను చాలా చెత్త కాంబో గా చెబుతున్నారు. టీ-బిస్కెట్ చాలా సింపుల్ గా రుచిగా అనిపిస్తుంది కానీ ఇది ఆరోగ్యాన్ని చాలా దారుణంగా దెబ్బతీస్తుందని అంటున్నారు. అసలు టీ-బిస్కెట్లు తీసుకోవడం వల్ల జరిగేదేంటి? పోషకాహార నిపుణులు ఏమంటున్నారు? తెలుసుకుంటే.. టీ-బిస్కెట్ కహానీ.. మార్కెట్లో లభించే ప్యాక్ చేసిన బిస్కెట్లు ఎక్కువగా పాశ్చరైజ్ చేయబడతాయి. వాటిలో శుద్ధి చేసిన పిండి అంటే మైదా, అధిక మొత్తంలో చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు,  అనేక ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. ఈ  పదార్థాలు టీలోని కెఫిన్,  టానిన్‌లతో కలిపినప్పుడు అది జీర్ణక్రియను చాలా  ప్రభావితం చేస్తుంది. శరీరంలో అనవసరమైన చక్కెర,  కొవ్వు పేరుకోవడాన్ని  పెంచుతుంది. టీ-బిస్కెట్ తినడం అనేది రోజువారీ అలవాటుగా మారితే  అది ఊబకాయం, మధుమేహం  జీర్ణ సమస్యల ప్రమాదాన్ని చాలా సులువుగా  పెంచుతుంది. పోషకాలు జీరో.. మార్కెట్లో దొరికే బిస్కెట్లు మైదా నుండి తయారవుతాయి.  వీటిలో  ఫైబర్, విటమిన్లు,  ఖనిజాలు ఏమీ ఉండవు.ఇందులో జీరో కేలరీలు ఉంటాయి. టీతో వాటిని తినడం వల్ల అప్పటిక్పుడు ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ పోషకాహారం ఏమీ ఉండదు. ట్రాన్స్ ఫ్యాట్స్.. బిస్కెట్లను క్రిస్పీగా చేయడానికి,  వాటి షెల్ఫ్ లైప్  పొడిగించడానికి హైడ్రోజనేటెడ్ నూనెలు లేదా ట్రాన్స్ ఫ్యాట్‌లను ఎక్కువగా ఉపయోగిస్తారు. ట్రాన్స్ ఫ్యాట్‌లు గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఈ కొవ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.  మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బులు,  స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. చక్కెర .. బిస్కెట్లలో చక్కెర,  శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వాటిని టీతో కలిపి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, ఆపై పడిపోతాయి. ఈ హెచ్చుతగ్గులు ఎక్కువగా జరిగితే అవి  శక్తి లేకపోవడానికి దారితీయడమే కాకుండా, దీర్ఘకాలంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. జీర్ణక్రియ, యాసిడ్.. బిస్కెట్-టీల కాంబో  జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. శుద్ధి చేసిన పిండిలో ఉండే  జిగట,  టీలోని టానిన్లు కలిసి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి.  టీలోని ఆమ్లతత్వం,  బిస్కెట్లలోని నూనె కడుపులో గ్యాస్, ఉబ్బరం,  యాసిడ్ ఎఫెక్ట్ ను ఎక్కువ  చేస్తాయి.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

వందేళ్లకు పైగా బ్రతకడానికి ఆయుర్వేదం చెప్పిన రహస్య చిట్కాలు..!

  ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు.  ఆయుష్షును పెంచడానికి ఎటువంటి మాయా సూత్రం లేదని,  ఇప్పటికీ కొన్ని పురాతన ఆయుర్వేద పద్ధతులను ఆచరించడం ప్రారంభిస్తే వంద సంవత్సరాలకు పైగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఈ విషయాన్ని స్వయంగా  చరక మహర్షి శిష్యుడైన  వాగ్భటాచార్యుడు  చెప్పారు. ఆయన ఆయుర్వేదంలో కొన్ని పద్దతులను వివరించాడు. వీటని పాటించడం వల్ల వందేళ్లకు పైగా ఆరోగ్యంగా జీవించడం సాధ్యమట.  ఇంతకీ ఆ రహస్య చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. భారతదేశ జనాభా దాదాపు 1.4 బిలియన్లు అయితే.. అందులో కేవలం 300 మిలియన్లు మాత్రమే పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. మిగిలిన వారు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కడుపు సమస్యలు, కీళ్ల నొప్పులు,  వాత-పిత్త-కఫ సమస్యలు వంటి వివిధ వ్యాధులతో బాధపడుతున్నారట. ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన జీవనశైలి,  ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా వారికి వచ్చే  85 శాతం అనారోగ్యాలకు స్వయంగా చికిత్స చేసుకోగలరని, కేవలం  15 శాతం అనారోగ్యాలకు మాత్రమే నిజంగా వైద్యుడు అవసరమవుతారని వాగ్భటాచార్యుడు పేర్కొన్నారు. తాగునీరు.. 3 నియమాలు.. ప్రతిరోజూ నీరు తాగుతాము, కానీ సరైన రీతిలో త్రాగడం కూడా అంతే ముఖ్యమని వాగ్బటాచార్యుడు చెప్పాడు.  మొదటి నియమం.. తిన్న వెంటనే నీరు త్రాగకూడదు, ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. రెండవ  నియమం.. నీటిని ఎల్లప్పుడూ గుటకలుగా త్రాగాలి. కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ తాగాలి. నీటిని  గ్లాసు లేదా చెంబు, బాటిల్ తో ఎత్తుకుని ఒక్కసారిగా ఎక్కువ మొత్తం తాగడం  ఆరోగ్యానికి మంచిది కాదు. మూడవ నియమం.. చల్లటి నీరు ఎప్పుడూ త్రాగకూడదు. చాలా చల్లటి నీరు కడుపులోని అగ్నిని బలహీనపరుస్తుంది. ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి ఆటంకం కలిగిస్తుంది. గోరువెచ్చని నీరు త్రాగడం ఎల్లప్పుడూ ఉత్తమంగా పరిగణించబడుతుంది. నిద్ర లేచిన వెంటనే నీరు.. ఉదయం నిద్ర లేచిన వెంటనే నోరు శుభ్రం చేసుకోకుండా నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. రాత్రిపూట ఉత్పత్తి అయ్యే లాలాజలంలో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ లాలాజలం శరీరం లోపలి నుండి శుభ్రపరచడంలో సహాయపడుతుంది.  అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఉదయం ఈ నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.  శరీరం విష పదార్థాలను తొలగిస్తుంది. ఆహారం, సమయం.. వాగ్భటుడు చెప్పిన దాని ప్రకారం సూర్యోదయం తర్వాత రెండున్నర గంటల పాటు శరీరం యొక్క జీర్ణాగ్ని బలంగా ఉంటుంది. ఉదాహరణకు.. సూర్యుడు ఉదయం 7 గంటలకు ఉదయిస్తే శరీరం యొక్క జీర్ణశక్తి ఉదయం 7:00 నుండి  9:30 గంటల మధ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాల్లో తినే ఆహారం బాగా జీర్ణమవుతుంది,  పూర్తి పోషణను అందిస్తుంది. అందువల్ల ఉదయం ఎక్కువగా, మధ్యాహ్నం కొంచెం తక్కువగా, రాత్రి తేలికైన భోజనం తినాలని ఆయన సలహా ఇచ్చారు. ఇష్టమైన ఆహారం, నియమాలు.. చాలామందికి ఇష్టమైన ఆహారాలు అంటూ  పరాఠాలు, స్వీట్లు, రబ్రీ, రసగుల్లాలు లేదా ఏదైనా భారీ ఆహారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారు  ఇష్టమైన ఆహారాన్ని ఉదయం తినాలట. ఉదయం  జీర్ణశక్తి చాలా బలంగా ఉంటుంది.  బరువైన ఆహారాలు కూడా సులభంగా జీర్ణమవుతాయి. అయితే, రాత్రిపూట అదే ఆహారాలు తినడం వల్ల ఊబకాయం, గ్యాస్,  అనారోగ్యానికి దారితీస్తుంది. ఆహారం ఇలా ఉండాలి.. ఆహారం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాకుండా మానసిక సంతృప్తికి కూడా అవసరమని వాగ్భటాచార్యులు  అన్నారు. మనస్సు సంతృప్తి చెందినప్పుడు శరీరం సరైన మొత్తంలో హార్మోన్లు,  ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది నిరాశ,  మానసిక అనారోగ్యాన్ని నివారిస్తుంది.  శరీరం చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంటుంది.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

వారెవ్వా మందారం టీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు.. మందరాన్ని మంచి హెల్త్ కోసం కూడా వాడవచ్చు.  విదేశాలలో పువ్వులతో టీ తయారు చేసుకుని తాగుతారు.  అలాంటి లిస్ట్ లో మందారం కూడా ఉంది.  అసలు మందారం టీలో ఉండే ఔషద గుణాలేంటి? మందారం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే.. మందారం టీ.. మందారం టీ చూడటానికి చాలా కలర్ పుల్ గా ఉంటుంది. ఇది రుచిలో పుల్లగా, క్రాన్బెర్రీ లాంటి రుచిని కలిగి ఉంటుంది.  ఈ టీలో కెఫిన్ ఉండదు. కాబట్టి ఆరోగ్యం కోసం ఎలాంటి సంకోచం లేకుండా దీన్ని తాగవచ్చు. మందారం టీ బెనిఫిట్స్.. మందారం టీ తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందట.  అధిక రక్తపోటు నియంత్రించడానికి మందారం టీ గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. ఇది నరాలను సడలించి గుండెపై ఒత్తిడి తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు.. మందారం టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ప్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో.. మందారం టీ శరీరంలో అమైలేస్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.  ఇది కార్బోహేడ్రేట్లు, స్టార్చ్ ల శోషణను నెమ్మదిస్తుంది.  ఈ ప్రక్రియ జరగడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాలేయం.. మందారం టీ తాగడం వల్ల కాలేయం శుద్ది అవుతుంది. కాలేయంలో  పేరుకున్న కొవ్వును తగ్గించడంలో మందారం టీ  చాలా బాగా సహాయపడుతుంది.                         మందారం టీ తయారు విధానం.. మందారం టీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.. మందారం రెక్కలు.. గుప్పెడు నిమ్మకాయ..  సగం చెక్క తేనె.. స్పూన్ నీరు.. ఒక గ్లాస్ తయారీ విధానం.. ఒక పాత్రలో ఒక గ్లాసు నీరు పోయాలి. అందులో శుభ్రం చేసుకున్న గుప్పెడు మందారం రెక్కలను వేయాలి. ఐదు నిమిషాల పాటు బాగా మరిగిన తరువాత స్టౌ ఆప్ చేయాలి.  కొంచెం వేడి తగ్గిన తర్వాత వడగట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి.  తేనె, నిమ్మరసం రుచి కోసం మాత్రమే.  అవి లేకుండా కూడా తాగవచ్చు.                                      *రూపశ్రీ.

బలమైన గుండె కావాలా? ఇవి తినండి చాలు..!

శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది.   అయితే ఈ మధ్య కాలంలో గుండె సంబంధ సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలామందిలో గుండె  బలహీనంగా మారడం వల్ల తొందరగా గుండె జబ్బులు రావడం జరుగుతోంది.  అందుకే గుండెకు బలాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలని వైద్యులు చెబుతారు.  గుండెకు బలాన్ని పెంచే ఆహారాలు ఏవి? ఆ లిస్ట్ ఒక్కసారి చూస్తే.. గుండెను బలంగా ఉంచే ఆహారాలు.. సాల్మన్.. సాల్మన్ వంటి కొవ్వు చేపలలో గుండెకు బలాన్ని చేకూర్చే  ఒమేగా-3 కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. సాల్మన్ చేపలు EPA,  DHA లను అందిస్తాయి.  ఇవి ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో, గుండె లయను స్థిరంగా ఉంచడంలో, రక్త నాళాల లైనింగ్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి.  క్రమం తప్పకుండా తింటే హృదయ సంబంధ సమస్యలను చాలా వరకు   తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఒమేగా-3 లు గుండె కణ త్వచాలలో కలిసిపోయి ఆరోగ్యకరమైన విద్యుత్ కమ్యునికేషన్ కు సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్.. ఎక్స్టా వర్జిన్ ఆలివ్ ఆయిల్ నూనెలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు,  పాలీఫెనాల్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మెరుగైన ఆరోగ్యకరమైన  కొలెస్ట్రాల్ ను అందిస్తాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.  రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.  ఆలివ్ నూనె తీసుకోవడం  వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి. అవకాడో.. అవకాడోలు సహజంగా ఒలీక్ ఆమ్లం, ఫైబర్, పొటాషియం, ఫోలేట్,  విటమిన్ E లతో నిండి ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్,  రక్తపోటు స్థాయిలకు మద్దతు ఇస్తాయి. వాల్నట్స్. క్రమం తప్పకుండా వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాల్‌నట్‌లలో మొక్కల ఆధారిత ఒమేగా-3లు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు,  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వాల్‌నట్‌లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన కొవ్వులను భర్తీ చేయడంలో సహాయపడుతుంది.  రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. బ్లూబెర్రీస్.. బ్లూబెర్రీస్ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. బ్లూబెర్రీస్‌లో ఉండే ఆంథోసైనిన్లు,  పాలీఫెనాల్స్ రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని,  ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయని చెబుతారు. ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుందట. ముదురు ఆకుకూరలు.. ముదురు ఆకుకూరలు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.  సహజ నైట్రేట్లతో సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. విటమిన్ K, ఫోలేట్, పొటాషియం,  యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి గుండెను బలంగా మారుస్తాయి.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

నెల రోజుల పాటు టీ మానేసి చూడండి.. షాకవుతారు..!

భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి,  అన్నింటికి మించి తలనొప్పి వచ్చినా,  ఫుడ్ లేటయినా కనీసం టీ  అయినా తాగాలి.  ఇలా టీ అనేది పానీయంలా కాకుండా ఒక ఎమోషన్ లా మారిపోయింది. అయితే టీ తాగడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు ఆరోగ్య నిపుణులు.  మరీ ముఖ్యంగా నెలరోజుల పాటు టీ తాగడం మానేయండి,  ఫలితాలు చూసి మీరే షాకవుతారు అని అంటున్నారు. ఇంతకూ నెలరోజుల పాటు టీ తాగడం మానేయడం వల్ల కలిగే మార్పులేంటో తెలుసుకుంటే.. నెలరోజులు టీ తాగడం మానేస్తే.. ఒక నెల పాటు టీ తాగడం మానేయడం వల్ల శరీరం నుండి  హానికరమైన సమ్మేళనాలను తొలగించడంలో సహాయపడుతుందట. ఇది కడుపులో యాసిడ్ ఎఫెక్ట్,  ఉబ్బరాన్ని తొలగించడమే కాకుండా,శరీర శక్తి స్థిరంగా ఉండేలా చేస్తుందట. ఇలా శరీరంలోపల శుద్ది కావడం శరీరానికి  రీసెట్ బటన్ గా పనిచేస్తుంది. నెల రోజుల పాటు టీ తాగడం మానేస్తే  నాలుగు ముఖ్యమైన మార్పులు ప్రధానంగా చోటు చేసుకుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీర్ణక్రియ.. టీ మానేయడం వల్ల కలిగే మొట్టమొదటి,  అత్యంత ప్రయోజనకరమైన విషయం జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగవ్వడం. టీలోని కెఫిన్,  టానిన్లు కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం వల్ల కడుపులో ఆమ్ల స్థాయిలు నార్మల్ అవుతాయి. ఆమ్లత్వం, గుండెల్లో మంట,  అజీర్ణం దాదాపుగా తొలగిపోతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఐరన్ శోషణ.. టీలోని టానిన్లు ఆహారం నుండి ఐరన్ ను గ్రహించడంలో  ఆటంకం కలిగిస్తాయి. టీ మానేసిన తర్వాత శరీరం ఆహారం నుండి ఐరన్ ను పూర్తి స్థాయిలో గ్రహిస్తుంది. రక్తహీనత లేదా అలసటతో బాధపడేవారికి ఇది చాలా మెరుగైన ఫలితాలు ఇస్తుంది. టీ మానేయడం వల్ల ఐరన్ గ్రహించే సామర్ఱ్యం పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం.. టీలో కెఫిన్ ఉంటుంది. ఇది నిద్ర హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం వల్ల  నిద్ర చక్రం తిరిగి రికవర్ అవుతుంది. గాఢంగా,   నాణ్యమైన నిద్రను పొందడంలో  సహాయపడుతుంది. మంచి నిద్ర నేరుగా  మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక కల్లోలం,  ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మం, దంతాల ఆరోగ్యం.. టీలోని టానిన్లు దంతాల మీద మరకలుగా మారి  దంతాల  రంగు మారుస్తాయి. టీ తాగడం మానేయడం వల్ల సహజంగా  దంతాలు శుభ్రంగా,  ప్రకాశవంతంగా కనిపిస్తాయి.  శరీరం హైడ్రేషన్ గా ఉండటం,  వాపు తగ్గడం మొదలైన వాటి వల్ల  పొడిబారడం తగ్గుతుంది.  చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

మూత్రాన్ని ఆపుకునే అలవాటుందా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

ప్రతి మనిషి శరీరానికి సహజ ధర్మాలు ఉంటాయి.  ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం,  దాహం వేసినప్పుడు నీరు త్రాగడం ఎలాగో.. మలమూత్ర విసర్జన కూడా అలాగే జరగాలి.  కానీ చాలామందికి మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉంటుంది.  పరిస్థితులు, సందర్భాలు ఏవైనా మూత్రం వచ్చినప్పుడు ఆపుకుంటూ ఉంటారు. దీని వల్ల ఇబ్బంది కలిగినా గత్యంతరం లేక ఇలా చేస్తుంటారు.  అయితే ఇలా మూత్రాన్ని ఆపుకోవడం అనేది చాలా లైట్ గా తీసుకోవాల్సిన విషయం కాదు. దీని వల్ల శరీరానికి చాలా నష్టం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  ఇంతకూ మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కలిగే నష్టాలేంటి? శరీరానికి కలిగే ప్రమాదాలేంటి? తెలుసుకుంటే.. చలికాలం కష్టం.. చలికాలం చాలామందిని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది.  వాటిలో మూత్రానికి వెళ్లడానికి బద్దకించే వారు కూడా ఉంటారంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇది చాలా నిజం. ఇదే కాకుండా బయటకు వెళ్లినప్పుడు లేదా ఏదైనా గుడి,  పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు.  ఇలా మూత్రాన్ని ఆపుకోవడం చాలా డేంజర్. మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కలిగే నష్టాలు.. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల కలిగే చాలా పెద్ద నష్టం మూత్రంలో ఇన్పెక్షన్ ఏర్పడటం.  మూత్రం మానవ శరీరంలో ఇన్ఫెక్షన్లు తొలగించడానికి సహాయపడుతుంది. కానీ మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రంలో ఉండే విష పదార్థాల ప్రభావం వల్ల మూత్రాశయ ద్వారం ఇన్పెక్షన్ కు లోనవుతుంది. మూత్రాన్ని ఎక్కువ సేపు పట్టి ఉంచడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది.  ఇది మూత్ర పిండాల సంబంధిత  సమస్యలకు దారితీస్తుంది.   మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు చాలా ప్రముఖమైనవి. మూత్రాన్ని ఎక్కువసేపు పట్టి ఉంచడం వల్ల మూత్రాశయం బలహీనంగా మారుతుంది.  మూత్రాశయ కండరాలు బలహీనం అవుతాయి.  ఇది మూత్రం లీకేజికి దారి తీస్తుంది.  ఇది చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రంలోని మలినాలు, విసర్జక పదార్థాలు కలిసి గట్టిపడి రాళ్లుగా మారే అవకాశం ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి దారి తీస్తుంది.  ఈ సమస్య కిడ్నీలను మరింత ప్రమాదానికి గురిచేస్తుంది.  అందుకే మూత్రాన్ని ఆపుకోవడం అస్సలు మంచిది కాదు.                                  *రూపశ్రీ.  

చలికాలంలో నిండుగా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం.  చలి ఎక్కువగా ఉన్నప్పుడు వెచ్చగా పడుకోవాలని అందరూ అనుకుంటారు. దీనికి తగ్గట్టే మందంగా ఉన్న దుప్పటిని నిండుగా కప్పుకొని పడుకుంటారు.  ఇలా పడుకున్నప్పుడు ఏకంగా ముఖాన్ని కూడా పూర్తీగా కవర్ చేసుకుని పడుకునే వారు ఎక్కువే ఉంటారు.  దీనివల్ల ముక్కు, నోరు, చెవులకు చలితీవ్రత సోకదని అనుకుంటారు. అయితే ఇలా పడుకోవడం మంచిదేనా? దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉందా? తెలుసుకుంటే.. చలికాలంలో నిండుగా దుప్పటి కప్పుకోవడం అనే అలవాటు వల్ల చలి నుండి ఉపశమనం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ  ఇలా చేయడం వల్ల  కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉన్న అదే గాలిని పదే పదే పీల్చుకుంటారు. తక్కువ ఆక్సిజన్, ఎక్కువ  కార్బన్ డయాక్సైడ్ ఉన్న గాలిలో నిద్రపోవడం మెదడుకు,  శరీరానికి హానికరం. ఈ అలవాటు నిద్ర నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా, కొన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు,  గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఫుల్ గా దుప్పటి కప్పుకుని నిద్రపోవడం వల్ల  శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఇది  మెదడు,  గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది.  ఇది మాత్రమే కాకుండా ఇలా నిద్రపోయే అలవాటు ఉన్నవారిలో ఉదయం తలనొప్పి, అలసట,  నోరు పొడిబారడం కూడా జరుగుతుందట.  12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. నోటి నుండి వచ్చే తేమ దుప్పటి  బట్టలో చిక్కుకుపోతుంది. దీని వలన దుప్పటి లోపల వాతావరణం వెచ్చగా,  తేమగా ఉంటుంది. ఈ వాతావరణం ఫంగస్  పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.  ముఖం మీద ఫుల్ గా దుప్పటి కప్పుకుని నిద్రపోవడం వల్ల ఈ అలెర్జీ కారకాలు నేరుగా ఊపిరితిత్తులలోకి వెళతాయి.  వీటి వల్ల  అలెర్జీలు,  శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెరుగుతుంది. ఆక్సిజన్ సరిగా  లేకపోవడం వల్ల  మెదడు రాత్రంతా విశ్రాంతి లేకుండా ఉంటుంది.   మంచి, గాఢమైన నిద్ర పట్టడం కష్టంగా ఉంటుంది.  ఒకవేళ నిద్ర పట్టినా ఉదయం లేవగానే తలనొప్పి, అలసట వంటివి ఏర్పడతాయి.   CO2కి అధికంగా గురికావడం వల్ల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది హృదయ స్పందన రేటు,  రక్తపోటును ప్రభావితం చేస్తుంది. అందుకే చలికాలంలో వెచ్చదనం కోసం ముఖాన్ని కూడా కప్పుకుని నిద్రపోవడానికి బదులు,  వెచ్చని దుస్తులు,  టోపి, కాళ్లకు సాక్స్ వంటివి ధరించి నిద్రపోవడం మంచిది. మరీ ముఖ్యంగా ఎంత చలి ఉన్నా ఫ్యాన్ ఉండాలి,  కానీ దుప్పటి కప్పుకోవాలి అని అనుకోకూడదు.                                            *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

కల్తీ లవంగాల కనికట్టు.. వీటిని తింటే ఎంత నష్టమంటే..!

  లవంగాలు వంటింట్లో ఉండే ఒక మసాలా దినుసు.  చాలా రకాల ఆహార పదార్థాల తయారీలోనే కాకుండా ఔషధ గుణాలు ఉన్న కారణంగా ఏవైనా ఆరోగ్య సమస్యల కోసం కూడా లవంగాలను వాడుతుంటారు. చాలామంది రోజూ ఒక లవంగం తినడం లేదా లవంగాలు ఉడికించిన నీటిని తాగడం చేస్తుంటారు. ఇదంతా శరీరం డిటాక్స్ కావాలని, శరీరంలో ఉండే చెడు పదార్థాలు,  మలినాలు తొలగిపోవాలని, రోగనిరోధక శక్తి బలంగా మారాలని చేస్తుంటారు. అయితే మంచి లవంగాలకు బదులు నకిలీ లవంగాలను వాడితే మాత్రం ఆరోగ్యానికి మేలు జరగకపోగా.. బోలెడు నష్టాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అసలు కల్తీ లవంగాలను ఎలా కనిపెట్టాలి? కల్తీ లవంగాలు తినడం వల్ల కలిగే నష్టాలేంటి? తెలుసుకుంటే.. కల్తీ లేదా నకిలీ లవంగాలు.. మార్కెట్లో లభించేవన్నీ మంచి లవంగాలు అనుకుంటే పొరపాటు.  చాలా వరకు లవంగాలలో నూనెను సేకరించి, వాటిలో వాసన, సారం అనేవి అన్నీ కోల్పోయాక వాటిని అమ్ముతుంటారు. కొందరేమో వాసన, సారం, నూనె కోల్పోయిన లవంగాలకు రసాయనాలు జోడించి వాటిని అమ్ముతుంటారు. ఇవ్నీ కల్తీ లేదా నకిలీ లవంగాలు అని ఆహార నిపుణులు అంటున్నారు. ఈ లవంగాలు ఎటువంటి ప్రయోజనాలను అందించవు.  ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కల్తీ లవంగాలు జీర్ణం కావడం కష్టం,  గ్యాస్, కడుపు నొప్పి, ఆమ్లతత్వం,  వికారం వంటి సమస్యలకు ఇవి కారణం అవుతాయి. కల్తీ లేదా నకిలీ లవంగాలు తినడం వల్ల కలిగే నష్టాలు.. పుఢ్ పాయిజన్.. సరిగ్గా తయారు చేయని లేదా రసాయనాలతో కల్తీ  చేయబడిన లవంగాలు ఫుడ్ పాయిజన్ కు  కారణమవుతాయి. దీని వలన వాంతులు, విరేచనాలు, బలహీనత,  తీవ్రమైన కడుపు తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో వాపు, తలనొప్పి.. నిజమైన లవంగాలు మంటను తగ్గిస్తాయి. కానీ నకిలీ లేదా కల్తీ  లవంగాలు ఈ లక్షణాలను కలిగి ఉండవు. బదులుగా అవి శరీరంలో మంటను పెంచుతాయి. కల్తీ లవంగాలకు రంగు,  సువాసన కోసం రసాయనాలను కలిపి ఉంటారు. ఇవి తలనొప్పి,  తలతిరుగుటకు కారణమవుతాయి. రోగనిరోధక శక్తి మటాష్.. నిజమైన లవంగాలు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. కానీ నకిలీ లవంగాలు శరీరానికి ఎటువంటి ప్రయోజనాలను అందించవు. ఎక్కువ కాలం నకిలీ లేదా కల్తీ లవంగాలను ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనం అవుతుంది. లివర్ నాశనమే.. చవకగా లభించే లవంగాలు,  రసాయనాలతో కల్తీ చేసిన సుగంధ ద్రవ్యాలు  కాలేయానికి క్రమంగా హాని కలిగిస్తాయి. ఇవి వెంటనే వాటి దుష్ప్రభావాలు బయటకి కనిపించేలా చేయకపోయినా వీటి నష్టం క్రమంగా బయటపడుతూ ఉంటుంది. నకిలీ లేదా కల్తీ లవంగాలు గుర్తించడం ఎలా.. ఒక గ్లాసు నీరు తీసుకొని కొన్ని లవంగాలు వేయాలి. లవంగాలు కల్తీ కాకపోతే అవి  మునిగిపోతాయి, కానీ అవి కల్తీ అయితే తేలుతాయి. అంతేకాదు.. లవంగాల నుండి నకిలీ రంగులు,  రసాయనాలు విడుదల కావడం కూడా కనిపిస్తుంది. నిజమైన లవంగాలు మంచి సువాసన, ఎక్కువకాలం కలిగి ఉంటాయి.  అదే నకిలీ లవంగాలు వాసన ఉండవు,  రంగు కూడా నిజమైన వాటితో పోలిస్తే వేరుగా ఉంటాయి. నకిలీ లవంగాలు నల్లగా,  పొడిగా,  బరువు లేకుండా తేలికగా,  చాలా సులభంగా విరిగిపోయేలా ఉంటాయి.                                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఆయుర్వేదం చెప్పిన రహస్యం.. ఉసిరికాయ ఇలా తింటే మ్యాజిక్కే..!

  ఆయుర్వేదంలో ఉసిరికాయను "అమృతఫలం" అని పిలుస్తారు.  అంటే అమృతంతో సమానమైన ఔషద గుణాలు కలిగిన ఫలం. అమృతంలాగా శరీరానికి గొప్ప ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది అని అర్థం.  ఉసిరికాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కానీ ఉసిరికాయ వల్ల అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలగాలంటే ఉసిరికాయను తినే విధానం చాలా ముఖ్యం అని ఆయుర్వేదం చెబుతోంది.   అసలు ఉసిరికాయను ఎలా తినాలి? ఆయుర్వేదం చెప్పిన ఆ విధానంలో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే.. ఉసిరికాయ ఉడికించి.. ఉసిరికాయను జ్యూస్ లాగా,  పచ్చిగా తినడం చూసే ఉంటారు. చాలామంది ఊరగాయ లాగా నిల్వ చేసుకుని కూడా తింటారు.  అయితే ఉసిరికాయను అలా కాకుండా ఆవిరి మీద ఉడికించి తింటే మ్యాజిక్ ఫలితాలు ఉంటాయట.  ఆవిరి మీద ఉడికించడం వల్ల ఉసిరికాయలో ఉండే విటమిన్-సి చెక్కు చెదరదని ఆయుర్వేద నిపుణులు కొందరు చెబుతున్నారు. ఉడికించిన ఉసిరికాయ ప్రయోజనాలు.. రోగనిరోధక వ్యవస్థ.. ఉడికించిన ఉసిరికాయలో  విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది,  ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.  జలుబు,  దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్లు,  అనారోగ్యాలతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. జీర్ణక్రియ.. ఉడికించిన ఉసిరికాయ  జీవక్రియను మెరుగుపరుస్తుంది,  మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.  ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన గట్ ఫ్లోరాకు ఇది  సహాయపడుతుంది.  చర్మం,  జుట్టు.. ఉసిరికాయ అందాన్ని చేకూర్చే  అద్భుతమైన ఫలం. ఉడికించిన ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు,  విటమిన్ సి చర్మ స్థితిస్థాపకతను కాపాడుకోవడానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది. చర్మానికి సహజ మెరుపును ఇస్తుంది. జుట్టు కుదుళ్లకు  పోషణ ఇస్తుంది.  జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది,  జుట్టును మందంగా, బలంగా,  మెరిసేలా చేస్తుంది. గుండె జబ్బులు.. ఉడికించిన ఉసిరికాయ గుండె ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి,  మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బులు,  అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉసిరిలో ఉండే  శోథ నిరోధక లక్షణాలు శరీరంలో మంట,  చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. కంటి చూపు.. విటమిన్ సి,  ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. ఉసిరికాయను  క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వయస్సు సంబంధిత కంటి సమస్యలైన మాక్యులర్ డీజెనరేషన్,  కంటిశుక్లం వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎలా తినాలంటే.. ఒక తాజా ఉసిరికాయను  బాగా కడిగాలి.  ఒక కుండలో లేదా బౌల్ లో నీరు పోసి పైన ఒక చెల్లు ప్లేట్ లేదా గిన్నె ఉంచి అందులో ఉసిరికాయను వేసి పైన మూత పెట్టాలి.  5నుండి 10 నిమిషాలలో ఉసిరికాయ మెత్తబడుతుంది.  ఆ తర్వాత దాన్ని బయటకు తీసి చల్లబడిన తర్వాత నమిలి నేరుగా తినవచ్చు.       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...