Read more!

ఖరీదైన ఆహారాలు అక్కర్లేదు.. రోజూ వీటిని గుప్పెడు తింటే ఉక్కులా మారతారు..

ఆరోగ్యమే మహాబాగ్యం అన్నారు. తీసుకునే ఆహారం అంతా శరీరం కోసమే. కానీ చాలామంది శరీరం కోసం కాకుండా రుచి కోసం, జిహ్వచాపల్యం కోసం అహారం తింటారు. దీని వల్ల ఆరోగ్యంగా ఉండాల్సిన శరీరం ట్రబుల్ ఇచ్చిన ఇంజిన్ లా మారుతుంది.  కొందరు శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన ఆహారాలు తినాలనే భావనలో ఉంటారు. అందుకే తాము ఆరోగ్యంగా లేమని సమర్థించుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే శరీరానికి అద్బుతమైన బలాన్ని చేకూర్చే ఆహారాలు ఖరీదైనవే కాదు, తక్కువ ధరలో సాధారణ పౌరులకు కూడా లభిస్తాయి. కానీ వాటిని గుర్తించి తినడం చాలా ముఖ్యం.  చాలామంది రాత్రి బాదం పప్పులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే వాటిని తింటుంటారు. కానీ బాదం పప్పులు అక్కర్లేదు. చికెను, మటనూ అసలే వద్దూ..  ప్రతిరోజూ గుప్పెడు నానబెట్టిన శనగలు తింటే చాలు. శరీరం ఉక్కులా మారుతుంది. అసలు నానబెట్టిన శనగలు తింటే కలిగే లాభాలేంటి?  వీటిని ఎలా తినాలి? తెలుసుకుంటే..

నల్లశనగలు బాదం పప్పు కంటే అద్బుతమైన పోషకాలు కలిగి ఉంటాయి. మాంసాహారం కంటే బలం చేకూరుస్తాయి. వీటిలో కాల్షియం, ప్రోటీన్, పైబర్, విటమిన్లు, మినరల్స్ సమృద్దిగా ఉంటాయి. వీటిని వేయించి తినవచ్చు, లేదంటే నానబెట్టి తినవచ్చు, నానబెట్టిన శనగలను మొలకలు తెప్పించి ఆ మొలకలు కూడా తినవచ్చు. ఇవి చాలా బలం.

గుప్పెడు శనగలను రాత్రి సమయంలో కప్పు నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఈ శనగలను పరగడుపున తినాలి. మగవారు నానబెట్టిన శనగలను తిన్న తరువాత గోరువెచ్చని పాలు తాగితే వారిలో స్పెర్మ్ కౌంట్ మెరుగవుతుంది. లైంగిక శక్తి పెరుగుతుంది.

ప్రతిరోజూ మొలకెత్తిన శనగలు తినడం వల్ల మలబద్దకం అనే సమస్య అసలు వేధించదు. ఎన్నో రోజులుగా బాదిస్తున్న మలబద్దకం కూడా కేవలం నల్ల శనగలను తినడం వల్ల  పరిష్కారం అవుతుంది. వీటిలో  ఉండే ఫైబర్ పేగులు మూసుకుపోకుండా చేస్తుంది.

వృద్దులలో కీళ్ల నొప్పులు సాధారణం. కానీ నానబెట్టిన శనగలను తింటూంటే వృద్దులలో కీళ్లనొప్పులు ఆశ్చర్యకరంగా తగ్గిపోతాయి. వీటిలో ఉన్న కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది.

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి కాలేయం పనితీరు సమర్థవంతంగా ఉండటం ఎంతో అవసరం. ఈ పనితీరులో కాలేయం కొన్నిసార్లు పాడైపోతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ నానబెట్టిన నల్ల శనగలు తినడం శ్రేయస్కరం.

వయసు పెరిగేకొద్ది ఎముకలు బలహీనంగా మారతాయి.  బలహీనమైన ఎముకలుంటే బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. బోలు ఎముకల వ్యాధి రాకూడదంటే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ నల్ల శనగలు తినాలి.

నల్లశనగలలో ఐరన్, పాస్పరస్ సమృద్దిగా ఉంటాయి. ఈ కారణంగా ఇది హిమోగ్లోబిన్ ను పెంచుతుంది. రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడేవారు ప్రతి రోజూ నల్లశనగలు తింటూంటే తొందరగానే ఈ సమస్య పరిష్కారం అవుతుంది.

బద్దకం, అలసట నివారించడానికి. శరీరంలో నూతనోత్తేజం నింపడానికి నల్లశనగలు భలే ఉపయోగపడతాయి. మొలకెత్తిన శనగలను ప్రతిరోజూ తింటూంటే  తొందరలోనే శరీరంలో  శక్తి పుంజుకుంటుంది. శరీరం దృఢంగా, చురుగ్గా మారడం స్పష్టంగా కనిపిస్తుంది.

ఇప్పట్లో చాలామందిలో చక్కెర వ్యాధి పెద్ద సమస్యగా ఉంది. నల్లశనగలు ప్రతిరోజూ తినడం వల్ల ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. శరీరంలో అదనపు గ్లూకోజ్ ను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారు వీటిని రోజూ తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

                                          *నిశ్శబ్ద.