రాక్షసుల మధ్య లంకలో వివేకా
posted on Mar 29, 2011 @ 12:32PM
గుంటూరు : వైఎస్ వివేకానందరెడ్డి రాక్షసుల మధ్య లంకలో ఉన్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు. అలాంటి వివేకా తాను లక్ష్మణుడు అంటే ఎవరూ నమ్మరన్నారు. రాక్షసులు వివేకాను బంగారు లేడిలా వాడుకుంటూ రామరాజ్యాన్ని కూల్చేందుకు యత్నిస్తున్నారన్నారు. ఆయన లక్ష్మణుడో, విభీషణుడో త్వరలోనే తెలుస్తుందన్నారు. వివేకానందరెడ్డి లక్ష్మణుడే అయితే ఇప్పటికైనా వచ్చి రామదండులో కలవాలని అంబటి పిలుపునిచ్చారు. నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటనపై ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాదారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పథకం ప్రకారమే ఉదయం నుంచి సాయంత్రం వరకూ హైడ్రామా నడిచిందన్నారు. రోజు పక్కన ఉండి తిడుతున్న డీఎల్‌ను ఏమనకుండా గాలి ముద్దుకృష్ణమనాయుడుపై చేయి చేసుకోవటంలో అర్థమేమిటని ప్రశ్నించారు. తిడుతుంటే వెంటనే స్పందించిన ఆయన సాయంత్రానికి కాంగ్రెస్ ముఖ్యనేతల మాటలు విని ఎందుకు వెనక్కి తగ్గారన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి త్యాగం చేసిన లక్ష్మణుడిలా ఫీలవుతున్నారన్నారు.