ప్రభుత్వభూములంటే ఎంత చులకన?
posted on Oct 13, 2012 @ 10:30AM
కబ్జా చేయాలంటే ప్రభుత్వ భూములను వెదుక్కుంటే సరి. దానిపై దొంగపట్టాలు, దొంగపత్రాలు సృష్టించేసుకుని పన్ను కట్టేస్తే ఆ భూమి సొంతమైనట్లే. ఇంత చులకనైన వ్యవహారం మరకొటి లేదు. దేశవ్యాప్తంగా ప్రభుత్వభూములను ఇదే దృష్టితో చూస్తారని ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కబ్జాదారులందరూ ఈ భూముల్లో పెద్దభవంతులు నిర్మించుకుని తిరిగి అమ్మకం ద్వారా సొమ్ము చేసుకున్నారని కూడా వెల్లడిరచింది. అలానే ఎమ్మెల్యే అయినా ఎంపి అయినా కూడా ప్రభుత్వభూములపైనే కన్నేస్తారు. దీనికి ప్రత్యేకమైన ఉదాహారణలు అవసరం లేదు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎమ్మెల్యే పంటకాలువను ఆక్రమించుకుని భవంతులు లేపారు. ఈయనలానే మిగిలిన పలు జిల్లాల్లోనూ ఆరోపణలున్నాయి. అయితే ఎక్కడా చర్యలు ఉండవు. తాజాగా రూ.450కోట్ల విలువైన హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని ప్రభుత్వభూమిపై కబ్జాకు కన్నేశారని ఉపకలెక్టరు చంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీదస్తావేజులతో కబ్జాదారులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుని విచారణ చేయాలని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు.