మహిళాలకై ఎన్ని చట్టాలు వచ్చినా ప్రయోజనం శూన్యం
posted on Oct 13, 2012 @ 11:06AM
కేంద్ర ప్రభుత్వం 1986 చట్టం ద్వారా మహిళలను అసభ్యంగా చూపినా అశ్లీలమైన ఈ సందేశాలు లేదా మెయిళ్లు పంపినా నేరం రుజువయితే గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు జీవితం, యాభై వేలనుండి లక్ష వరకు జరిమానా విధిస్తారు. అదే రెండోసారి నేరానికి పాల్పడితే ఏడేళ్లవరకు జైలు, 5,00,000 రూపాయలవరకు జరిమానా విధిస్తారని చట్టం రూపొందించ బడింది. అయితే ఈ చట్టం ఎంతవరకు అమలవుతుందో చెప్పటం కష్టమేనని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటె ఈ రెండిటిని పెంచి ప్రోత్సహించే టివి ఛానల్స్, సినిమాలు ఈ చట్ట పరిధిలోకి ఎంత వరకు వస్తాయన్నది ప్రశ్నార్ధకం. ఇప్పటి వరకు చిన్నపిల్లలతో చేయించే రియాల్టీ షోలు, అరికట్టబడుతుందనేది అపోహ మాత్రమే నని సామాజిక వేత్తల అభిప్రాయం. ఎందుకంటె చట్టంలో ఎక్కడా అశ్లీలం ఏమిటన్నది నిర్వచించ బడలేదు. అలాగే సినిమాలు ఆర్ట్ లుగా చూడాలని డైరెక్టర్ల ఉవాచ. అదీకాకుండా సినిమాలను అసభ్య సీన్లు రాకుండా చూడటానికి సెన్సా ర్ సభ్యులు ఉంటారు. కాని వారిని డైరెక్టర్లు, ప్రోడ్యూసర్లు కవర్ చేస్తుంటారు. వారు సోషల్ రెస్సాన్స్ ఫీలవనంతవరకు ఈ వ్యవస్థను ఎవరూ కాపాడలేరని , హీరోలు, హీరోయిన్లు విషసాంప్రదాయాలను ఉత్పత్తి చేస్తున్నారని మేధావులు విమర్శిస్తున్నారు. ఈ చట్టాలన్నీ కేవలం పేపర్లకు మాత్రమే పనికి వస్తాయని వారు భావిస్తున్నారు.