నాకే దిక్కులేదు....ఇక...
posted on Oct 3, 2012 7:26AM
తన దాకా వస్తే కాని... అన్నట్లుగా ప్రభుత్వం పనితీరు, ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు సామాన్యులు చెబితే నేతలు ఏ మాత్రం పట్టించుకోరు సరికదా.. అన్ని పనులు ఒకేసారి ఎలాచేస్తారు... ఓపికపట్టాలి... అంటూ నీతివచనాలు చెబుతుంటారు. అదే తనదాకా వచ్చినప్పుడే.. అది తెలిసేది. కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల శాఖా మంత్రి కపిల్ సిబల్‌కు ఇటువంటి అనుభవమే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ నుండి ఎదురైంది. అప్పటికాని ఆయన ప్రభుత్వ సంస్థల పనితీరు అర్ధంకాలేదు. మా ఇంట్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ పనిచేయకపోతే ప్రతిరోజు సంస్థకు ఫిర్యాదు చేసుకుంటూ వెళ్ళాను... నా కంప్లైంట్‌ను పరిష్కరించటానికి వారంరోజులు పట్టింది..’ అని ఆయన కంపెనీ పనితీరును విమర్శించారు. ఇది కూడా ఆయన బిఎస్‌ఎన్‌ఎల్ సేవా పదక్ అవార్డుల కార్యక్రమంలో మాట్లాడారు. ఇప్పటికైనా తెలిసింది నిర్లక్ష్యానికి, నిర్లిప్తతకు మారుపేరు ప్రభుత్వ రంగ సంస్థలని. ప్రభుత్వ అధికారులని. మంత్రికే వారం రోజులు పడితే... ఇక సామాన్యుడు తన అక్షరాభ్యాసంనాడు ఫిర్యాదు చేయిస్తే... అతని షష్టి పూర్తికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతవేగంగా వారి పనులుంటాయని... అదే డబ్బు వసూలు తదితరాల్లో మాత్రం ముందుంటారని సామాన్యుల ఉవాచ. నిజమేమిటో.. మంత్రిగారి వ్యాఖ్యలు అర్ధంచేసుకున్న అందరికి తెలియాలి!