కేసిఆర్ ‘దాడుల’ ఫై జగ్గా రెడ్డి సీరియస్
posted on Dec 10, 2012 @ 2:23PM
తెలంగాణా ప్రత్యెక వాదం పేరుతో కాంగ్రెస్ మంత్రులు, ఇతర నాయకులఫై దాడులు చేస్తే, ప్రతి దాడులు తప్పవని టిఆర్ఎస్, జెఏసి లను ప్రభుత్వ విప్ జగ్గా రెడ్డి హెచ్చరించారు.
శాసనసభలో తెలంగాణా వ్యతిరేక వైఖరి తీసుకొన్న ఎంఐఎం ను ఎందుకు లక్ష్యంగా చేసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎంఐఎం ను ఎదిరించే సత్తా టిఆర్ఎస్ కు గానీ, జెఏసి కి గానీ లేదనీ జగ్గా రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎంఐఎం పార్టీ బహిరంగ సమావేశం పెట్టినప్పటికీ వారు ఎందుకు అడ్డుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఎంఐఎం ను ఎదుర్కోలేని కేసిఆర్, కోదండ రామ్ లు వందేళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ ను ఎలా ఎదుర్కొంటారని జగ్గా రెడ్డి ప్రశ్నించారు.
తమ పార్టీ నేతల ఫై దాడులు చేయడం ఇక నుండి అయినా మానుకోవాలని ఆయన సూచించారు. తిరిగి తమ పార్టీ నేతలు కూడా దాడులు చేస్తే పరిస్థితి ఏమిటని ఆయన హెచ్చరించారు.