రాష్ట్రంలో పుకార్ల కలకలం
posted on Aug 23, 2012 @ 9:37AM
రాష్ట్రంలో రోజుకొక పుకార్లు షికారు చేస్తున్నాయి. బుధవారం రాత్రి అప్పుడే పుట్టిన బిడ్డ మాట్లాడుతోందని, పసిపిల్లలు నిద్రపోతే వారు చనిపోతారనే పుకార్లు చెలరేగాయి. దీంతో భయపడిన చిన్నపిల్లల తల్లిదండ్రులు రాత్రంతా తమ బిడ్డలను పడుకోనివ్వకుండా జాగారం చేశారు. అసలు ఈ పుకార్లు ఎక్కడ ప్రారంభమౌతున్నాయో తెలియడం లేదు కానీ ఇలా రోజుకొక పుకార్లు షికారు చేయడంతో అటు పోలీసులు ఇటు ప్రజలు ఇబ్బందుల పాలౌతున్నారు.