అమెరికాలోనే రెడ్డి అంత్య క్రియలు ?

 

 

 

గత ఆదివారం అమెరికాలోని సిన్సినాటిలో గల తన షాపులో హత్యకు గురి అయిన గోలి వెంకట రెడ్డి అంత్య క్రియలు అమెరికాలోనే చేయాలని ఆయన బంధువులు నిర్ణయించారు. రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉంది. నిబంధనల ప్రకారం వెంకట రెడ్డి మృత దేహాన్ని స్వదేశానికి పంపే వీలు లేకపోవడంతో అక్కడే అంత్య క్రియలు చేయాలని నిర్ణయించారు.

 

కరీంనగర్ జిల్లా కోహెడ మండలం గుండా రెడ్డి పల్లికి చెందిన వెంకట రెడ్డి గత 12 సంవత్సరాలుగా అమెరికాలోనే ఉంటున్నారు. ఈ కేసులో ఇంత వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని కోలోరియన్ టౌన్ షిప్ పోలీస్ అధికారి మీడియా ప్రతినిధులతో అన్నారు.

Teluguone gnews banner