పరిటాల శ్రీరామ్ కోసం వెతుకుతున్న పోలీసులు

 

 

 

కాంగ్రెస్ నేత సుధాకర రెడ్డి హత్యా ప్రయత్నం కేసులో నిందితునిగా ఉన్న పరిటాల రవి తనయుడు శ్రీరామ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గత నెల 29 న మారణాయుధాలతో పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ధర్మవరం రూరల్ పోలీసులు శ్రీరామ్ ఫై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

 

తెల్లవారుజామునే తన ఇంట్లోకి పోలీసులు వచ్చి తనిఖీలు నిర్వహించడం దారుణమని ఎంఎల్ఏ పరిటాల సునీత అన్నారు. తాను మహిళా ఎంఎల్ఏని అని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరుకు ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో తన భర్తను కూడా ఇలాగె పోలీసులు సోదాలతో వేధించారని, చివరకు ఆయన హత్య చేయబడ్డారని, ప్రస్తుతం తన కుమారుడి విషయంలో కూడా తనకు ఆందోళనగా ఉందని సునీత అన్నారు. స్పీకర్ అనుమతి లేకుండా ఓ ఎంఎల్ఏ ఇంటిని ఎలా తనిఖీ చేస్తారని ఆమె ప్రశ్నించారు.

 

మరోవైపు జిల్లా ఎస్ పి విలేఖరులతో మాట్లాడుతూ అంత చట్టానికి లోబడే జరుగుతోందని, ఎలాంటి రాజకీయ వత్తిడులకు తలొగ్గడం లేదని వ్యాఖ్యానించారు.

 

పరిటాల కుటుంబానికి, సుధాకర్ రెడ్డి కి మధ్య ఎలాంటి ఫ్యాక్షన్ తగాదాలు లేవని, అలాంటప్పుడు ఆయనను చంపాల్సిన అవసరం ఏముంటుందని టిడిపి ఎంఎల్ఏ పయ్యావుల కేశవ్ అన్నారు.

Teluguone gnews banner