స్తంభించిన బ్యాంకింగ్ సేవలు

 దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో లావాదేవీలన్నీ పూర్తిగా స్తంభించిపోయాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులు, ఎటీఎంలు మాత్రం పనిచేయడంతో వినియోగదారులకు కాస్తంత ఊరట కలిగింది.

కానీ గురువారంకూడా సమ్మె కొనసాగుతుంది కనుక ఏటీఎంలలో డబ్బు అయిపోతే పరిస్థితి మరింత గడ్డుగా తయారవుతుంది. ద యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్ ఆధ్వర్యంలో 5 యూనియన్లు, ప్రభుత్వ బ్యాంకుల అధికారులకు చెందిన నాలుగు యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. ఎస్బీఐ, ఐడీబీఐ లాంటి ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు 12 ప్రైవేట్ రంగ బ్యాంకులు, 8 విదేశీ బ్యాంకులకు సంబంధించిన  అధికార్లంతా సమ్మెలో పాల్గొంటున్నారు. కేంద్రం నియమించిన ఖండేల్వాల్ కమిటీ మానవవనరుల విధానాలపై చేసిన సిఫార్సుల్ని యూఎఫ్ బీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో 
యూనియన్లు సమ్మెకు దిగాయి. సమ్మెకారణంగా నగదు బదిలీలు, చెక్కుల క్లియరెన్స్ లు, విదేశీ మారక సేవలు, ఇతర బ్యాంకింగ్ కార్యకలాపాలకు తీవ్రస్థాయిలో విఘాతం కలిగింది. ఖాతాదారులు నానా కష్టాలూ పడ్డారు. ఖాతాదారుల సౌకర్యార్థం ఏటీఎమ్ లలో నగదును ఉంచడానికి ఎస్బీఐ ప్రైవేట్ సంస్థ సేవల్ని వినియోగించుకుంది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.