అమ్మాయిని నగ్నంగా వీడియో తీసిన దుండగులు
posted on Jul 29, 2012 @ 11:15AM
గౌహతిలో జరిగిన దారుణం మరిచిపోక ముందే మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో మరో దారుణం జరిగింది. ప్రేమికుడి ముందే ప్రియురాలిని వివస్త్రను చేసిన దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. శనివారం నరసన్నపేట ప్రాంతం నుంచి భావనపాడు సాగర తీరానికి వచ్చిన ప్రేమ జంటపై స్థానికులైన ఆకతాయిలు ప్రేమజంట పట్ల దుర్మగంగా ప్రవర్తించారు. ప్రియుడిని కొట్టి చెట్టుకు కట్టేసి, అతని ఎదుటే ప్రియురాలిని నగ్నంగా చేసి రాక్షసానందం పొందారు.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలిలోని భావనపాడులో ఈ ఘటన జరిగింది. ఆ జంట తెచ్చిన సెల్ ఫోన్, డబ్బులు తీసుకొని ఆ ఫోన్‌తోనే ఆమెను వీడియో తీశారు. కొంచెం సేపు తరుట యువతి వారి నుంది తప్పించుకొని నగ్నంగా సమీప గ్రామంలోకి పరుగులు తీసింది. యువతిని గమనించిన కొందరు మహిళలు ఆమెకు ఆశ్రయమిచ్చి, సమాచారంతో గ్రామస్తులు సంఘటన స్థలం చేరుకొనేసరికి దుండగులు అక్కడి నుండి పారిపోయారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.