డెడ్‌లైన్‌తో తెలంగాణా కోసం పోరాడాలి: కోదండరాం
posted on Jul 29, 2012 @ 9:53AM
కాంగ్రెస్ ఎంపీలు డెడ్‌లైన్‌తో నిర్దిష్ట కార్యాచరణతో ఉద్యమాన్ని చేపట్టాలని, లేనిపక్షంలో ప్రజల్లో విశ్వసనీయతను మరింత కోల్పోతారని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘంలో ఆధ్వర్యంలో 'తెలంగాణ ఉద్యోగుల కిరణం' మాసపత్రిక ఆవిష్కరణ సభ శనివారం సాయంత్రం సచివాలయంలో జరిగింది. ఈ పత్రికను సీఎస్ మిన్నీ మాథ్యూ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో కోదండరాం మాట్లాడారు. తెలంగాణను ఇవ్వలేమంటూ రాష్ట్రపతికి కేంద్ర హోం శాఖ నివేదిక ఇచ్చిందన్న సమాచారం విశ్వసనీయతను పరిశీలించకుండానే మీడియాలో కథనాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణపై ఏకాభిప్రాయం కావాలంటూ కేంద్రమంత్రి చిదరంబరం మూడేళ్ల నుంచి అరిగిపోయిన రికార్డునే వినిపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ విషయంలో ఇంటి దొంగలను వదిలేసి తనను రాజీనామా చేయాలని కొందరు కోరుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విషయంలో మోసం చేస్తే మొదటి రాజీనామా తనదేనని ఎంపీ మధుయాష్కీ ప్రకటించారు.