నిరాహారదీక్ష చేపట్టిన అన్నహజారే
posted on Jul 29, 2012 @ 11:43AM
జన్‌లోక్‌పాల్ సహా ఇతర అంశాల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి తాను ఇచ్చిన నాలుగు రోజుల అల్టిమేటం ముగియడంతో అన్నహజారే దీక్షకు దిగారు. జన్‌లోక్‌పాల్ కోసం మరణించే వరకూ పోరాడతానని హజారే ప్రకటించారు. 2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్, బీజేపీలకు రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని ఆయన సూచించారు. తనకు రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని, ఎన్నికల్లో కూడా పోటీచేయబోనని పునరుద్ఘాటించారు.