గీతికాశర్మ ఆత్మహత్య కేసు: లొంగిపోయిన గోపాల్ కందా
posted on Aug 18, 2012 9:09AM
ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్ గోయల్ కందా శుక్రవారం న్యూఢిల్లీలోని అశోక్ విహార్ పోలీసులకు అర్థరాత్రి లొంగిపోయారు.ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కందా ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేయడంతో ఆయనకు గత్యంతరం లేకుండా పోయింది. తన సోదరుడు గోవింద్ కందా, పలువురు అనుచరులతో కలసి పోలీస్ స్టేషన్ వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.