అమీన్ పూర్ దర్గాను దర్శించుకున్న ఎ.ఆర్. రెహమాన్
posted on Aug 18, 2012 @ 10:24AM
ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ శనివారం వైఎస్ఆర్ జిల్లా అమీన్ పూర్ దర్గాను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం దర్గాలో పీఠాధిపతితో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్గాలో జరిగే ఉత్సవానికి గంధాన్ని సమర్పించి పూలమాలలతో అలంకరించారు. కాగా సినీనటి శ్వేతాబసు ,పూరీ జగన్నాధ్ సోదరుడు నటుడు సాయి రామ్ శంకర్ కూడా అమీన్ పూర్ దర్గాను సందర్శించారు. ప్రార్ధనలు నిర్వహించి పూల దండలు సమర్పించారు.