2జీని మించిన బొగ్గు స్కామ్ కాగ్ నివేదిక
posted on Aug 18, 2012 8:53AM
బొగ్గు, విద్యుత్తు, ఢిల్లీ విమానాశ్రయంపై కాగ్ ఇచ్చిన నివేదికలను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ మూడు అంశాల్లో ఏకంగా రూ.3.06 లక్షల కోట్ల అక్రమాలు జరిగాయని కాగ్ నిగ్గు తేల్చింది. మరీ ముఖ్యంగా 142 బొగ్గు బ్లాకుల పందేరం అడ్డగోలుగా జరిగిందని కాగ్ తేల్చింది. 4400 కోట్ల టన్నుల బొగ్గును కారుచౌకగా కట్టబెట్టినట్లు వెల్లడించింది. గనుల శాఖ స్వయంగా ప్రధాని మన్మోహన్ చేతిలో ఉండగానే ఈ బొగ్గు గనులు చేజారిపోవడాన్ని విపక్షాలు వేలెత్తి చూపుతున్నాయి.