ఎన్టీఆర్‌తో బావ అని పిలింపిచుకున్న విఠల్ రెడ్డి కన్నుమూత
posted on Oct 20, 2012 @ 5:05PM
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రేమతో ..గౌరవంగా ‘బావ’ అని పిలుచుకునే కమ్యూనిస్టు కురు వృద్ధుడు, మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ శాసన సభ్యుడు చిలుముల విఠల్ రెడ్డి (98) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న శుక్రవారం రాత్రి మెదక్ జిల్లా నర్సాపూర్‌లో తుదిశ్వాస విడిచారు. విఠల్ రెడ్డి నర్సాపూర్ శాసనసభ్యుడిగా 1962లో తొలిసారిగా ఎన్నికయ్యారు. సిపిఐ శాసనసభా పక్ష నాయకుడిగా ఆయన కూడా పని చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. విఠల్ రెడ్డిని అప్పట్లో ఎన్టీఆర్ ‘బావ’గా అభివర్ణించేవారు. ఆ తర్వాత, టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా విఠల్ రెడ్డికి మంచి అనుబంధమే ఉండేది.