రూ. 7.50 లక్షలు పలికిన బాలాపూర్ గణేశుడి లడ్డు
posted on Sep 29, 2012 @ 11:10AM
వినాయక నిమజ్జనంలో ప్రత్యేకంగా నిలిచే బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర పలికింది. రూ.7.50 లక్షలకు పన్నాల గోవర్ధన్ లడ్డూను సొంతం చేసుకున్నారు. లడ్డూ ధర గత ఏడాది కంటే రూ.2.05 లక్షలు ఎక్కువ పలికింది. గతేడాది లడ్డూ ధర రూ.5.45 లక్షలు. నాన్న చివరి కోరిక మేరకు లడ్డూను దక్కించుకున్నట్లు గోవర్ధన్ రెడ్డి తెలిపారు. బాలాపూర్ లడ్డూ బరువు 21 కిలోలు. దీనిని తాపేశ్వరంలో ప్రత్యేకంగా తయారుచేయించడం జరుగుతుంది. 1994లో మొదటి సారి లడ్డూ ధర రూ.450 పలికింది.