కొడాలి నానికి జైలు శిక్ష
posted on Jul 31, 2012 @ 9:52AM
కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని), మరో ఎనిమిది మందికి కైకలూరు కోర్టు ఏడాది కఠిన కారాగారశిక్ష విధించింది. మృతదేహంతో ఆందోళన నిర్వహించి, అధికారుల విధులకు ఆటంకం కలిగించిన నేరానికి సోమవారం ఈ శిక్ష విధించింది. 2005 సంవత్సరంలో ముదినేపల్లి మండలం పెదపాలపర్రుకు చెందిన రైతు కాటూరు మోషే (65) తన పంటభూమిని ప్రభుత్వం తీసుకుంటుందని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.