సిఎం తో డిప్యూటీ సిఎం భేటీ
posted on Aug 14, 2012 @ 12:47PM
గత కొద్ది రోజులుగా ఇంటర్ విద్యార్థుల కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించకుండా ప్రభుత్వం ఆలసత్వం చేసింది. నిన్న కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపిన సబ్ కమిటీ కాలేజీ యాజమాన్యాలతో ఒప్పందానికి వచ్చింది. ప్రభుత్వం కళాశాల యాజమాన్యాలకు తమ అంగీకారాన్ని పత్రాలపై సంతకాలు చేసి ఎ.ఎఫ్.ఆర్.సి ముందు సమర్పించాలని కోరింది. యాజమాన్య కోటా, కన్వీనర్ కోటాను కూడా 35వేల రూపాయలుగా అందులో పేర్కొనడం, రెండేళ్ళ పాటు ఇదే విధంగా జరగాలని ఉండడంతో యాజమాన్యాలు ఇది చూసి ఇలాంటి నిబంధనలను తాము అంగీకరించమని తేల్చి చెప్పాయి. ఈ విషయంపై రాష్ట్ర డిప్యూటీ సిఎం దామోదర్ రాజనర్సింహ ముఖ్యమంత్రితో కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. దామోదర్ రాజనర్సింహ ముఖ్యమంత్రికి విషయాన్ని విశదీకరించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సాయంత్రం కాలేజీ యాజమాన్యాలతో భేటీ అవుతారని సమాచారం.