తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
posted on Sep 8, 2025 @ 9:59AM
కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో భక్తుల రర్దీ కొనసాగుతున్నది. సోమవారం (సెప్టెంబర్ 8) ఉదయం శ్రీవారి భక్తుల కోసం వేచి ఉన్న భక్తులతో 18 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక ఆదివారం (సెప్టెంబర్ 7) చంద్రగ్రహణం ఉండటంతో ఆలయం మధ్యాహ్నం నుంచి మూసివేయడంతో శ్రీవారిని దర్శింకుకున్న భక్తుల సంఖ్య 27 వేల 410 మాత్రమే. ఇక 9 వేల 665 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 39 లక్షల రూపాయలు వచ్చింది.