ఢిల్లీలో మళ్లీ తెలంగాణ లొల్లి
posted on Sep 4, 2012 @ 1:15PM
ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేపట్టిన దీక్ష ఉద్రిక్తంగా మారింది. జంతర్ మంతర్ నుంచి ప్రథాని నివాసంవరకూ ర్యాలీగా వెళ్లిన బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రథాని నివాసంవైపుకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించి బీజేపీ కార్యకర్తల్ని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువుని ప్రయోగించారు. వాటర్ కేనన్ తో గుంపుని చెదరగొట్టారు. కొందరు కార్యకర్తల్నిపార్లమెంట్ పోలీస్టేషన్ లో ఉంచడంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పెద్దఎత్తున విరుచుకుపడుతున్నారు. ప్రకాష్ జవదేకర్ తోపాటు, తెలంగాణని కోరుకునే కొందరు నేతలుకూడా కిషన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఆందోళనలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణకు గాయమైంది.