కోల్ స్కాంపై స్పీడ్ పెంచిన సిబిఐ
posted on Sep 4, 2012 @ 12:53PM
బొగ్గు కోణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. హోంశాఖ ఆదేశాల మేరుకు సీబీఐ అక్రమార్కులపై దృష్టి సారించింది. హైదరాబాద్ సహా 30 చోట్ల ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా, పాట్న, నాగపూర్ నగరాలలోని ప్రముఖ వ్యక్తులు, ఇళ్లలో దాడులు జరుపుతోంది. 2006 -09 మధ్య జరిగిన బొగ్గు కేటాయింపులపై సీబీఐ ఆరా తీస్తోంది. ఇప్పటి వరకు ఐదు కంపెనీలపై కేసు నమోదు చేసింది. ప్రైవేటు వ్యక్తులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులపైనా కేసులు నమోదయ్యాయి.