అమ్మాయి పై 11 మంది అత్యాచారం
posted on Sep 24, 2012 @ 2:47PM
ప్రేమించిన అమ్మాయిని 11 మందితో కలిసి సామూహిక అత్యాచారం చేసిన దుర్ఘటన చండీగఢ్‌లో జరిగింది. ఈ సంఘటన జరిగిన పదిరోజుల తరువాత బాధితురాలు ఈ విషయం కుటుంబసభ్యులకు చెప్పగా, మరుసటి రోజే తన తండ్రి గుండె పోటుతో మరణించాడు. అమ్మాయిని ప్రేమించిన మహేందర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమ్మాయి చెప్పిన ప్రకారం పటేల్‌నగర్‌కు బయలు దేరిన ఆమెను దారిలో మహేందర్ కలిశాడు. ఆమెతో మాట్లాడుతుండగా మహేందర్ స్నేహితులు 12 మంది వారిద్దరిని చుట్టుముట్టారు. అందరు కలిసి ఆమెను చెరకు తోటలోకి తీసుకొని వెళ్లి అత్యాచారాని పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పటేల్‌నగర్‌లోని బంధువు ఇంటికి దగ్గర్లో పడేసిపోయారు. ఈ సంఘటనపై గ్రామంలోని దళిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మహేందర్ బృందంలోని వాడిగా భావిస్తున్న శీతూను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.