విమలక్క అరెస్ట్ ను ఖండించిన ఎర్రబెల్లి
posted on Sep 24, 2012 @ 1:55PM
విమలక్క అరెస్ట్‌పై పలు సంఘాల నేతలు నిరసన వ్యక్తపరిచారు. టీయూఎస్ నేతలు, టీ.టీడీపీ నేత ఎర్రబెల్లి, అరుణోదయా సమాఖ్య, టీ.జేఎసీ నేతలు, కేకే తీవ్రంగా ఖండించారు. తెలంగాణ కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే దిలీప్ కుమార్ హెచ్చరించారు. ఈ సమయంలో విమలక్కను అరెస్ట్ చేయడం తెలంగాణవాదులను రెచ్చగొట్టడమే అని కేకే పేర్కొన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ధ్వంసం కేసులో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్కతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివిద సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత వారిని సీసీఎస్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతకు ముందు విమలక్క అరెస్ట్ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. విమలక్క స్వయంగా తామే విగ్రహాన్ని ధ్వంసం చేశామని ప్రకటించారు.