ఏపీ ప్రత్యేక హోదా.. జయలలిత వల్లే ఇవ్వడంలేదు
posted on Aug 12, 2015 @ 2:32PM
ఏపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి మినహా రాష్ట బంద్ కు చేపట్టారు. మరోవైపు ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు కేంద్రమంత్రులతో సన్నాహాలు చేస్తున్నారు. ఇవన్నీ బానే ఇప్పుడు ప్రత్యేక హోదా పై సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కావాలనే ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదాను ఇవ్వడం లేదని ఆరోపించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన చేసేప్పుడు ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిందని.. కానీ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం తాము అధికారంలోకి వస్తే 10 ఏళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని మాటలు చెప్పారని.. కానీ ఇప్పుడు ఇవ్వనని చెప్పడం సబబు కాదని అన్నారు. అంతేకాదు ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం కనుక ఏపీకీ ప్రత్యేక హోదా ఇస్తే అటు తమిళనాడు కాని.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కాని అంగీకరించరని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి జయ పార్టీ మద్ధతు తప్పనిసరిగా కావల్సిన నేపథ్యంలో ఆమె కోసం ప్రత్యేక హోదా పక్కన పెట్టారని.. కావాలనే ఈ విషయంపై జాప్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు అంటే ఎలాగూ మిత్రపక్షం కాబట్టి ఇవ్వకపోయినా ఊరుకుంటారని అందుకే అందుకే కేంద్రం కూడా ఏపీకి ప్రత్యేక హోదా వ్యవహారంపై పట్టించుకోవడం లేదని అన్నారు.