అగ్రిగోల్డ్ డిపాజిటర్లు ఆందోళన పడోద్దు
posted on Aug 11, 2015 @ 5:03PM
అగ్రిగోల్ట్ సంస్థ డిపాజిటర్లకు టోకరా వేసి ఉడకాయించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కుంభకోణానికి బలైన డిపాజిటర్లకు ఏపీ ప్రభుత్వం ఒక తియ్యటి కబురు చెప్పింది. డిపాజిటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. డిపాజిటర్లకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కుంభకోణ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం విచారణ కమిటీని నియమించిన నేపథ్యంలో విచారణ కమిటీ మంగళవారం ఉదయం విజయవాడ క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయింది. ఈ సమావేశంలో అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులు రూ.7,000 కోట్లు ఉన్నాయని.. సంస్ధ డిపాజిటర్లలకు రూ. 6,800 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. దీనిలో భాగంగా సంస్థ ఆస్తులు వేలం వేస్తే 7,000 కోట్లకు పైగా వస్తాయని దీంతో డిపాజిటర్లకు మొత్తాన్ని చెల్లించవచ్చని చెప్పారు. దీనికి చంద్రబాబు కూడా అంగీకరించి సంస్ధ ఆస్తులు అమ్మైనా సరే డిపాజిటర్ల సొమ్ము వచ్చేలా చూడాలని.. బాధితులకు రెండు, మూడు నెలల్లో పరిహారం చెల్లించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ సందర్భంగా నర్సింహమూర్తి మాట్లాడుతూ డిపాజిటర్లు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పారు.. సంస్థకు ఉన్న అప్పుల కంటే ఆస్తుల విలువే ఎక్కువగా ఉన్నాయని.. వచ్చే నెలలోనే సంస్థ ఆస్తులను వేలం ద్వారా విక్రయించి డిపాజిటర్లకు న్యాయం చేస్తామని ఆయన చెప్పారు. కాగా దేశ వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులు 32లక్షల మంది ఉండగా ఒక్క ఏపీలోనే 19 లక్షల మంది ఉండటం గమనార్హం.