ఏపీ హోదాపై నిలదీసిన చంద్రబాబు

 

ఏపీ ప్రత్యేకహోదాపై రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో పరిస్థితి మరీ తీవ్రం తరం కావడంతో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రమంత్రులతో హోదాపై ఫోన్ లో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని ప్రత్యేక హోదా విషయంపై నిలదీసినట్టు తెలుస్తోంది. దీంతో అరుణ్ జైట్లీ స్పందించి ప్రత్యేక హోదాపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని.. తుది నిర్ణయానికి వస్తే మీతో మాట్లాడుతామని చెప్పారని తెలుస్తోంది. కాగా వెంకయ్యనాయుడు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు కూడా చంద్రబాబు ఫోన్ చేసి ప్రత్యేక హోదా గురించి మాట్లాడినట్టు సమాచారం. అయితే ప్రత్యేక హోదా గురించి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను అర్ధం చేసుకున్నామని.. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని.. ఈ విషయం చర్చించడానికి కొంత సమయం ఇవ్వాలని అమిత్ షా చంద్రబాబుతో అన్నట్టు తెలుస్తోంది.

 

అంతేకాదు ఏపీ ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు కూడా అరణ్ జైట్లీతో భేటీ కాగా రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఆదుకుంటామని.. పేరుకు ఏదైనా హోదా కంటే ఎక్కువ ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని సాయం చేస్తామని.. పది రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని.. అతి త్వరలో ఏపీకి మరిన్ని ప్రకటనలు ఉంటాయని చెప్పారు జైట్లీ టీడీపీ ఎంపీలకు తెలిపినట్టు సమాచారం.

Teluguone gnews banner