దర్శకుడు రాజమౌళి తల్లి రాజనందిని మృతి
posted on Oct 20, 2012 @ 2:28PM
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి తల్లి రాజనందిని(79) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ ఉదయం ఆమె మృతి చెందారు. దీర్ఘకాలిక అనారోగ్యమే అందుకు కారణంగా తెలుస్తోంది. రాజనందిని భర్త విజయేంద్ర ప్రసాద్ ప్రముఖ రచయిత మరియు దర్శకుడు. రాజమౌళి ఇతర కుటుంబ సభ్యులు తరచూ వివిధ కార్యక్రమాల్లో కనిపిస్తున్నా... ఆమె మాత్రం ఎక్కువగా బయటికి వచ్చే వారు కాదు. రాజమౌళిని జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు రాఘవేంద్రరావు పరామర్శించారు. రాజనందని మరణవార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు రాజమౌళి కుటుంబానికి సంతాపం తెలపడానికి వాళ్ల ఇంటికి బయల్దేరారు.