మరో కేసులో సంజయ్ దత్

 

నూరానీ ప్రొడ్యూసర్ గా 'జాన్ కి బాజీ' చిత్రంలో నటించడానికి సంజయ్ దత్ 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్నాడు. సగం సినిమా పూర్తయిన తరువాత సినిమా షూటింగ్ లలో పాల్గొనకుండా, తను ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని, డబ్బులు అడిగితే తనను చంపుతానని బెదిరింపులు వస్తున్నాయని నూరానీ తరపు న్యాయవాది నీరజ్ గుప్తా పిటీషన్లో పేర్కొన్నాడు. గత ఫిబ్రవరి 13న అంథేరీ మెట్రోపాలిటన్ కోర్టులో షకీల్ ఫిర్యాదు చేశాడు. కోర్టుకు హాజరుకావాలని రెండుసార్లు కోర్టు సమన్లు పంపినా సంజయ్ దత్ పట్టించుకోలేదు. దాంతో అంథేరీ మెట్రోపాలిటన్ కోర్టు సంజయ్ దత్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారెంట్ అందుకున్న సంజయ్ దత్ సోమవారం న్యాయస్థానం ఎదుట హాజరయ్యాడు. కోర్టు సంజయ్ దత్ కు బెయిల్ మంజూరు చేసింది.

Teluguone gnews banner