మళ్ళీ పేలనున్నపెట్రో బాంబ్
posted on Sep 4, 2012 @ 12:32PM
పెట్రో బాంబ్ పేల్చేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోమారు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబరు 7న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తర్వాత డీజిల్ ధరల్ని 4 నుంచి 5 రూపాయలు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఆగస్టులోనే డీజిల్, పెట్రోల్ ధరల్ని పెంచాలని ఆయిల్ కంపెనీలు ప్రయత్నించాయి. అయితే పార్లమెంటు సమావేశాల కారణంగా ధరల పెంపును వాయిదా వేసుకున్నాయి. సెప్టెంబరు 7 తర్వాత డీజిల్‌తో పాటు పెట్రోల్ ధరను కూడా పెంచే అవకాశం ఉందని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి.