బొగ్గుపాలౌతున్న అడవవి బిడ్డల బ్రతుకులు
posted on Oct 17, 2012 @ 9:35AM
అటవీప్రాంతంలో బొగ్గుగనుల తవ్వకాలకు అనుమతులు ఇవ్వటం ఒకవైపు పర్యావరణానికి, మరోవైపు అటవీప్రాంత పరిరక్షణకు చేటు తెచ్చిపెట్టింది. బొగ్గు కోసం నిరుపేద అడవిబిడ్డల బతుకులను ఎరగావేసిన ఘనత కూడా కేంద్రప్రభుత్వానికే దక్కింది. దేశంలో 13బొగ్గుగనులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 1.1మిలియన్ హెక్టార్ల అటవీప్రాంతానికి ఈ గనుల వల్ల తీవ్రనష్టం జరుగుతోంది. ఈ మొత్తం గనుల్లో జరుగుతున్న దోపిడీ కూడా మాటల్లో చెప్పలేం. ఒక్క మహన్‌బ్లాకులోనే 14వేల మందికిపైగా గిరిజనులు తమ సాంప్రదాయక ఇళ్లను కోల్పోయారు. ఈ బొగ్గుగనుల కోసం అటవీప్రాంతం చుట్టూ కంచె వేస్తున్నారు. గిరిజనులను అడవిలోపలికి వెళ్లటానికి కంపెనీలు అనుమతి ఇవ్వటం లేదు. దీంతో వీరు తమ సహజసిద్ధమైన జీవనవిధానాన్ని కోల్పోయారు. ఎప్పుడూ ఆడుతూ తుళ్లుతూ తిరగాల్సిన గిరిజనబాలలు నిరాశగా గనుల కంపెనీల చేష్టలకు తలొగ్గుతూ బాల్యాన్ని సైతం కోల్పోతున్నారు. ఈ గనుల వల్ల పర్యావరణానికి ప్రమాదమని ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కేంద్రం స్పందించలేదని పర్యావరణవేత్త ఆశిష్‌కోఠారి చెప్పారు. గిరిజనుల హక్కులకు భంగం కలిగించే కేంద్రం చర్యలను ఆయన ఖండించారు.