Read more!

ప్రేమికుల పండుగలో తియ్యని వేడుక..చాక్లెట్ డే కు భలే ఐడియాలు ఇవి..!

వాలెంటైన్స్  డే అంటే యువతకు చాలా ప్రత్యేకం. ఈ వారాంతం మొత్తం బోలెడు చాక్లెట్లు, గులాబీలు, గిఫ్టులు అమ్ముడుపోతాయి. కోట్లమీద వ్యాపారం కేవలం చాక్లెట్ల ద్వారా జరుగుతుందంటే అతిశయోక్తి లేదు. వాలెంటైన్స్ డే వీక్ లో అందరికీ ఇష్టమైన చాక్లెట్ డే రోజు ఊరికే అంగట్లో  చాక్లెట్ లు తెచ్చివ్వడం కాకుండా కాస్త వెరైటీగా.. మరింత నోరూరేలా ఈ కింది విధంగా మీ భాగస్వామిని సంతోషపెట్టవచ్చు. ఇంతకీ భాగస్వాములను ఆకట్టుకునే ఆ చాక్లెట్ రుచులు ఏంటో తెలుసుకుంటే..

చాక్లెట్ డిప్డ్ స్ట్రాబెర్రీస్..

ఇవి బయటెక్కడో కొనక్కర్లేదు. ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. నోరూరించే స్ట్రాబెర్రీస్ ను కరిగించిన చాక్లెట్ లో ముంచి వాటిని ఫ్రిజ్ లో ఉంచాలి. స్ట్రాబెర్రీస్ పైన చాక్లెట్ లేయర్ లా కోట్ అవుతుంది. ఇవి చూడటానికి భలే అట్రాక్షన్ గా ఉంటాయి. అలాగే రుచిలోకూడా భలే ఉంటాయి. వీటిని కాస్త ఆకర్షణీయంగా డెకరేట్ చేస్తే బయట గిప్టు షాపులలో కొనే గిప్టులకంటే ఇవే చాలా అట్రాక్షన్ గా ఉంటాయి. ఎందుకంటే స్ట్రాబెర్రీస్ సాధారణంగానే హృదయం ఆకారంలో ఉంటాయి. ఇది కూడా వీటి ఎంపికకు కారణం.

చాక్లెట్ స్పా సెట్..

అమ్మాయిలకు అందం మీద చాలా ఆసక్తి. ఎప్పుడూ అందంగా కనిపించాలని అనుకుంటారు. దానికి తగినట్టే చాలా సౌందర్య ఉత్పత్తులను, బ్యూటీ టిప్స్ ను ఫాలో అవుతారు. కానీ అమ్మాయిలకు చాక్లెట్ స్పా చాలా బాగా నచ్చుతుంది. ఇందులో చాక్లెట్ ఫ్లేవర్ తో చేసిన సోప్ లు, బాడీ స్క్రబ్, లోషన్లు, మాయిశ్చరైజర్లు ఉంటాయి. చాక్లెట్ ఫ్లేవర్ తో ఘుమఘుమలాడే వీటిని ఎంతో ఇష్టంగా వాడతారు.

కస్టమైజ్డ్ చాక్లెట్స్..

సాధారణంగా అంగట్లో తెచ్చిన చాక్లెట్స్ ఎప్పుడూ ఇచ్చేవే. అందుకే ఈ చాక్లెట్ డే రోజున స్పెషల్ ఉండేలా చూసుకోవాలి. చాక్లెట్లమీద భాగస్వామి పేరు ఉండేలానూ, భాగస్వామికి ఏదైనా ప్రత్యేకంగా చెప్పాలనుకున్న విషయాలన్ని చాక్లెట్ కవర్ లోపల చిన్న కాగితంలో ఉంచి ఇవ్వవచ్చు.

చాక్లెట్ మేకింగ్ కిట్..

అమ్మాయిలకు అసలే చాక్లెట్లంటే బోలెడు ఇష్టం. ఎన్ని చాక్లెట్లు ఇచ్చినా, ఎంత ఖరీదైన చాక్లెట్లు ఇచ్చినా తృప్తి పడరు. ఆ తరువాత వెంటనే ఇంకా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ పక్కాగా వస్తుంది. అందుకే చాక్లెట్ తయారుచేసే కిట్ వారికి గిప్ట్ గా ఇవ్వొచ్చు. ఈ కిట్ లో కోకో పౌడర్, మౌల్డ్స్ తో సహా చాక్లెట్స్  తయారీకి అవసరమైన ఇతర వస్తువులు కూడా ఉంటాయి.

కేవలం ఇవి మాత్రమే కాకుండా చాక్లెట్ డే రోజు భాగస్వామితో రెస్టారెంట్ కు వెళ్లి నచ్చిన చాక్లెట్ కేక్స్, ఫుడ్డింగ్, చాక్లెట్ లో ఉన్న బోలెడు వెరైటీలను ఆస్వాదించవచ్చు.

                                           *నిశ్శబ్ద.