Read more!

మీ  ప్రపోజ్ కు ఎదుటివారు నో చెప్పకూడదంటే ఈ 5 తప్పులు చెయ్యకండి!

 

ప్రేమ ఈ ప్రపంచంలో చాలా శక్తివంతమైన ఆయుధం. ఫిబ్రవరి అనగానే చాలామందికి ప్రేమికుల రోజే గుర్తుకొస్తుంది. ఈ ప్రేమికుల దినోత్సవం కేవలం ఒకరోజుతో కాకుండా వాలెంటైన్స్ వీక్ గా జరుపుకోబడతుంది. మొదటిరోజు  రోజ్ డే  తరువాత రెండవరోజును ప్రపోజ్ డే గా జరుపుకుంటారు.  ప్రపోజ్ డే రోజు నచ్చిన వారికి ప్రపోజ్ చేయడం ద్వారా కొత్త బంధానికి పునాది పడుతుంది. అయితే కొందరు ఈ ప్రపోజ్ ను తిరస్కరించే అవకాశం కూడా ఉంది. సో.. నచ్చినవాళ్లకు ప్రపోజ్ చేసినప్పుడు వారు నో చెప్పకూడదంటే ప్రపోజ్ చేసేటప్పుడు ఈ కింది తప్పులు అస్సలు చేయకూడదు..

ప్రిపరేషన్ లేకపోవడం..

ప్రపోజ్ చేసేటప్పుడు చాలామంది నేరుగా పువ్వు లేదా ఉంగరం, లేదా బహుమతులు ఇచ్చి ప్రపోజ్ చేస్తుంటారు. కానీ ప్రేమను వ్యక్తం చేయడానికి  ముందుగా ప్రిపేర్  అవ్వడం చాలాముఖ్యం. ఇది సానుకూల ఫలితాలను ఇస్తుంది.  ప్రపోజ్ అనేది తేలికగా తీసుకోవలసిన లేదా ఇష్టానుసారంగా అమలు చేయవలసిన విషయం కాదు. వివరాలను ప్లాన్ చేయడానికి సమయాన్ని వెచ్చించాలి.  భాగస్వామి  ప్రాధాన్యతలను పరిగణలో ఉంచుకోవాలి.  ప్రపోజ్ చేయడానికి మంచి ప్లేస్ ను ఎన్నుకోవాలి. ముఖ్యంగా చాలా పాజిటివ్ గా ఉండాలి.

పార్ట్నర్ ఇష్టాఇష్టాలు..

భాగస్వామి ఇష్టాఇష్టాల గురించి అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం. ఇది వారికి ప్రాధాన్యత ఉంది అనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చేస్తాయి. వారికి అసౌకర్యం కలిగించే ఏ పనిని, ఏ పరిస్థితిని తీసుకురాకుండా చూసుకోవాలి. ప్రేమను వ్యక్తం చేయడం, ఎమోషన్స్ ను బయటపెట్టడమే కాదు.. భాగస్వామి మనసును అర్థం చేసుకుంటేనే వారి మనసులో స్థానం ఉంటుంది.  

ఓవర్ గా ఏదీ వద్దు..

సినిమాలలో చూపించినట్టు నలుగురి మధ్య ప్రపోజ్ చేయడం, గట్టిగా అరిచి చెప్పడం, సర్పైజ్ పేరుతో అతిగా ప్రవర్తించడం, ప్రేమను వ్యక్తం చేయడమనే పేరుతో భాగస్వాములకు ఇబ్బంది కలిగే చర్యలు చేయడం, పబ్లిక్ లోనే భాగస్వామిని ముట్టుకోవడం వంటివి చేయకూడదు. ఏ చిన్న తప్పు జరిగినా భాగస్వామి సింపుల్ గా నో చెప్పి వెళ్లిపోవచ్చు. అందుకే ప్రపోజ్ ను కూడా ఆచి తూచి సందర్భం చూసి చేయాలి

సహజత్వం కోల్పోవద్దు..

సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో చాలామంది కృత్రిమంగా మారిపోతారు. అలాగే పరిస్థితులను కూడా క్రియేట్ చేస్తారు. ఇవన్నీ ఊహించుకోవడానికి, చూడటానికి బాగుంటాయి కానీ అనుభూతి చెందే విషయంలో మాత్రం అంత తృప్తిని ఇవ్వవు. ఏదైనా సరే మనసులో నుండి వచ్చేదే స్పష్టంగా, సహజంగా ఉంటుంది. కాబట్టి అసవసరపు డాంభికాలకు పోకుండా సహజంగా ప్రపోజ్ చేయాలి. అదే విధంగా గుర్తుంచుకోవలసిన మరొక విషయం ఫీలింగ్స్.. ఏదో సరదాకు నచ్చేశారు అనే భావనతో కాకుండా జీవితాంతం వారితో కలిసి ఉండాలని, పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ప్రపోజ్ చేయడం మంచిది.  ఇదే విషయాన్ని భాగస్వామితో కూడా చర్చించాలి. భాగస్వామి వైపు పరిస్థితులను, వారి నిర్ణయాలను గౌరవించాలి.

నిజాయితీ..

ప్రేమించడంలోనూ, ప్రపోజ్ చేయడంలోనూ నిజాయితీగా ఉండటం ఎంతో అవసరం. లేని ఫీలింగ్స్ ను ఎక్ప్రెస్ చేసి  ఎదుటివారి ఫీలింగ్స్ తో ఆడుకోకూడదు. ప్రేమ విషయంలోనూ, భవిష్యత్తు విషయంలోనూ నిజాయితీగా, జీవితం మీద ఒక భరోసా ఇవ్వగలిగేలా ఉండాలి. మీరు ఉత్తమ భాగస్వామి కాగలరనే నమ్మకాన్ని మీ భాగస్వామికి అనిపించేలా చేస్తే మీ ప్రపోజల్ కు నో చెప్పడం అంటూ జరగదు.

                                  *నిశ్శబ్ద.