Read more!

టెడ్డీ బేర్స్ తోనే మీలో ఉన్న  రొమాంటిక్ యాంగిల్ ను బయట పెట్టొచ్చు..!

టెడ్డీ బేర్స్ చిన్నపిల్లల నుండి  అమ్మాయిల వరకు అందరూ ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా ఈ వాలెంటైన్ వీక్ లో టెడ్డీ బేర్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది. అంతేనా  ప్రతి ప్రియుడు  తన  ప్రియురాలికి  వాలెంటైన్ వీక్ లో టెడ్డీ బేర్ గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటారు. అయితే  ఇలా  టెడ్డీ బేర్స్ ఇవ్వడంలోనూ కొన్ని ప్రత్యేక రంగులు ఎంపిక చేసుకుని ఇవ్వడం వల్ల టెడ్డీ బేర్ డే కాస్తా చాలా రొమాంటిక్ గా మారిపోతుంది. ఆ రంగులు ఏంటో తెలుసుకుంటే..

నలుపు..

నలుపు రంగు టెడ్డీ బేర్ లు చాలా అరుదుగానే దొరుకుతాయి. అయితే  ఇవి స్పెషల్ గా అనిపిస్తాయట. చాలావరకు యూత్ కానీ, అమ్మాయిలు కానీ నలుపు రంగు  వేసుకోవడానికి ఇష్టపడతారు. అలాగే అబ్బాయిలు అమ్మాయిలకు నలుపు రంగు టెడ్డీ బేర్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీలవుతారు. అంతేకాదు.. ఈ రంగు టెడ్డీ బేర్ ఇవ్వడం వల్ల రిలేషన్ లో ఎలాంటి నెగిటివ్ సమస్యలున్నా అన్నీ పోతాయంట.

పింక్, గ్రీన్..

పింక్ కలర్ అంటే అమ్మాయిలకు ప్రాణం. టెడ్డీల నుండి డ్రస్సులు, చీరలు,  చెప్పులు, లిప్స్టిక్ ఇలా అన్ని అదే రంగు కావాలన్నా వేసేసుకుంటారు. సో పింక్ కలర్ టెడ్డీ బేర్ ఇస్తే అమ్మాయిలు చాలా హ్యాపీ అవుతారు. అలాగే ఇది రొమాంటిక్ గా కూడా ఉంటుంది.  ఇక గ్రీన్ కలర్ టెడ్డీ కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇది ప్రకృతికి దగ్గరగా ఉండే రంగు. ప్రశాంతతను చేకూర్చడం ద్వారా ఇది మనిషిని రొమాంటిక్ మూడ్ వైపు మళ్లిస్తుంది.  పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ప్రకృతిని ఇష్టపడేవారు వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు.

క్రీమ్ అండ్ వైట్..

క్రీమ్ అండ్ వైట్ టెడ్డీ బేర్లు ప్రశాంతతకు చిహ్నంగా ఉంటాయి.  అమాయకత్వం, ప్రేమ, శాంతి, స్వచ్చత కోరుకునేవారు, వాటి ద్వారా  మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు.  ఇవి రిలేషన్ ను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఎరుపు, పర్పుల్..

ఎరుపు అంటే ప్రేమకు పెద్ద నిర్వచనం. ఇక పర్పుల్ రంగు మనిషిలో ఉండే ఉత్సాహాన్ని సూచిస్తుంది. అంతేకాదు.. ఈ రంగు టెడ్డీ బేర్ లను గిఫ్ట్ గా ఇస్తే రాయల్ లుక్ ఉంటుంది. అలాగే లగ్జరీ మూమెంట్స్ ను ఇవి ప్రతిబింబిస్తాయి. ఇవి అమ్మాయిలకు చాలా బాగా నచ్చుతాయి.

                                                      *నిశ్శబ్ద.