వైయస్ ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు: విజయమ్మ

కడప: చిత్రావతి రిజర్వాయర్‌ను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప జిల్లా పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ రైతులతో కలిసి సందర్శించారు.నీటి లభ్యతకు సంబంధించిన వివరాలను ఆమె ప్రాజెక్టు ఎస్ఇని, డిఇని అడిగి తెలుసుకున్నారు. రైతు సమస్యలను ఆమె అధికారులకు వివరించారు. తన నియోజకవర్గం రైతులను ఆత్మహత్యలకు ప్రోత్సహించవవద్దని  నీటిపారుదల శాఖ అధికారులను కోరారు. చిత్రావతి రిజర్వాయర్‌కు తుంగభద్ర హైలెవెల్ కెనాల్ నుంచి న్యాయబద్ధంగా రావాల్సిన సాగు, మంచినీళ్లను విడుదల చేయాలని ఆమె కోరారు. డ్యామ్‌లో తగినంత నీరు లేనందున ఇబ్బంది అవుతోందని ఆమె చెప్పారు.

పులివెందుల ప్రాంత ప్రజలకు మంచినీటి కోసం సైతం ఇబ్బంది పడే పరిస్థితి ఉందని, పంటలన్నీ ఎండిపోయేలా ఉన్నాయని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే సాగు నీటి సమస్య వచ్చి ఉండేది కాదని ఆమె అన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆమె అన్నారు. ఎన్ని లేఖలు రాసినా స్పందించడం లేదని ఆమె విమర్శించారు. జనవరి 1వ తేదీలోగా చిత్రావతికి 0.5 టిఎంసిల నీరు ఇవ్వడానికి అధికారులు ఆమె హామీ ఇచ్చారు. అయితే లిఖితవూర్వక ఆమె కోసం ఆమె అనంతపురానికి బయలుదేరి వెళ్లారు.
 

Teluguone gnews banner