నేపాల్లో ఘోర విమాన ప్రమాదం,19 మృతి
posted on Sep 28, 2012 @ 6:05PM
నేపాల్ రాజధాని ఖాట్మాండ్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 16 మంది ప్రయాణీకులు, ముగ్గురు విమాన సిబ్బందితో సహా 19 మంది దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది విదేశీయులే ఉన్నారు. విమానం నేలకూలగానే మంటలు చెలరేగి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. ఘటన ఈరోజు ఉదయం 6.15 గంటలకు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. విమానం పూర్తిగా బూడిదయ్యింది. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న అధికారులు, సైన్యం సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న అందరూ మృతి చెందారు. ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ విమానంలో ప్రయాణిస్తున్నవారిలో ఎక్కువ మంది ఇటాలియిన్‌కు చెందిన పర్యాటకులుగా గుర్తించినట్లు అధికారు తెలిపారు.