గాంధీ సాక్షిగా యాత్రను ప్రారంభించిన చంద్రబాబు
posted on Oct 2, 2012 @ 12:52PM
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ సాక్షిగా తాను పేదల కోసం పాటుపడతానని చంద్రబాబు నాయుడు అన్నారు. కాంగ్రెసు పాలనలో రాష్ట్రం అస్తవ్య్తంగా మారిందని విమర్శించారు. తాను పేదల సంక్షేమం కోసం పాటుపడతానని చెప్పారు. అనంతరం అక్కడి నుండి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లారు. అక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించారు. అక్కడి నుండి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లిన బాబు బెంగళూరు చేరుకున్నారు. అటునుండి అనంతపురం వెళ్లనున్నారు. చంద్రబాబు పాదయాత్ర విజయవంతం కావాలని ఆయన అభిమానులు, కార్యకర్తలు పూజలు హోమాలు నిర్వహించారు. బాబు స్వంత జిల్లా నారావారి పల్లెలో అభిమానులు వినాయక హోమం నిర్వహించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వారు ఆకాంక్షించారు.