బాబు పాదయాత్ర పై బొత్స సెటైర్
posted on Oct 2, 2012 @ 1:25PM
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాదయాత్ర మీ కోసం కంటే 'నాకోసం' అనే పేరు పెట్టుకుంటే బాగుండేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. పదవిలో ఉన్నప్పుడు ఓ మాట, పదవి పోయిన తర్వాత మరోపాట మాట్లాడటం బాబుకు అలవాటేనని ఆయన అన్నారు. ప్రభుత్వంపై బాబు చేస్తున్నవి ఆరోపణలు మాత్రమేనని...సంక్షేమ పథకాల అమలులో బాబుతో చర్చకు సిద్ధమేనని బొత్స సవాల్ విసిరారు. రాజకీయ లబ్ధి కోసం బాబు యాత్రను చేపట్టారని, అలాంటి యాత్రను అడ్డుకోవాల్సిన అవసరం కాంగ్రెస్కు లేదన్నారు. రాష్ట్ర విభజనపై హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని బొత్స స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంత నేతలు ముఖ్యమంత్రిపై చేసిన విమర్శలను ఆయన ఈ సందర్భంగా ఖండించారు. సీఎంపై తెలంగాణ మంత్రులు అసంతృప్తిగా లేరని, తెలంగాణ అంశంపైనే ఆవేదన చెందుతున్నారని బొత్స అన్నారు.