దిగ్విజయ్ పై సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశం
posted on Oct 19, 2012 @ 11:29AM
కాంగ్రెస్ నాయకుల్లో ఒకరి వేనుక ఒకరు అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోతున్నారు. మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌పై ట్రెజర్ ఐలాండ్ స్కాంలో విచారణ జరిపి ఆరు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సీబీఐని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించినట్లు మహేష్ గార్గ్ అనే పిటిషనర్ తరఫున వాదించిన న్యాయవాది డాక్టర్ మనోహర్ దలాల్ తెలిపారు. ఈ స్కాంపై సామాజిక కార్యకర్త మహేష్ గార్గ్ 2009లోనే రాష్ట్ర ఆర్థిక అక్రమాల నిరోధ విభాగానికి ఫిర్యాదు చేశారు. ఇండోర్‌లోని ఎంజీ రోడ్డులో మధ్యప్రదేశ్ హౌసింగ్ బోర్డుతో కలిసి 2002లో ట్రెజర్ ఐలాండ్ అనే మాల్‌ను నిర్మించిన ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్ డెవలపర్స్‌పై ఆ విభాగం ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. నివాస ప్రాంతంలో అక్రమంగా ఈ మాల్‌ను నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక రాయితీలు ఇచ్చిందని ఆరోపణలొచ్చాయి. దిగ్విజయ్ సింగ్‌తో పాటు మొత్తం 12 మందిపై ఈవోడబ్ల్యు విచారణ జరిపింది. తర్వాత ఆరుగురిపై మాత్రమే కేసు నమోదు చేసి దిగ్విజయ్ సింగ్‌కు క్లీన్‌చిట్ ఇచ్చింది.