ఖుర్షిద్ రాజ్యంలో అధికారులపై రాళ్ళ దాడి
posted on Oct 19, 2012 @ 11:32AM
దమ్ముంటే యూపీలోని తన సొంత నియోజకవర్గం ఫరీదాబాద్ కొచ్చి నిరసన తెలపాలంటూ కేజ్రీవాల్ కి సవాల్ విసిరిన ఖుర్షీద్ అలా జరిగితే కేజ్రీవాల్ తిరిగి వెనక్కెళ్లే అవకాశమే లేదంటూ చేసిన సంచలన వ్యాఖ్య ఇది. ఖుర్షీద్ అన్నట్లుగానే, ఆయన ట్రస్ట్ లో ఆర్ధిక అవకతవకలపై సర్వే చేసేందుకు వెళ్ళిన ఢిల్లీకి చెందిన విలేకరి అభినందన్ మిశ్రా, స్థానిక కన్వీనర్ నేతృత్వంలో ఐఏసీ కార్యకర్తలు ఖుర్షిద్ స్వగ్రామం పితౌరా నుంచి తిరిగి వస్తుండగా కొంతమంది దుండగులు వారిపై దాడి చేసి కొట్టారు. రాళ్లు రువ్వారు. ఈ ఘటనపై తాము పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశామని బాధితులు చెప్పారు. డాక్టర్ జాకీర్ హుస్సేన్ మెమోరియల్ ట్రస్ట్ అక్రమాలపై కథనాలను ప్రసారం చేసినందుకు టీవీ టుడే చైర్మన్, ఎండీ అరుణ్ పూరీ తదితరులపై కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఆయన భార్య లూసీ ఢిల్లీలో పరువు నష్టం కేసును దాఖలు చేశారు.