జగన్ కి సీబీఐ కోర్టు షాక్.. ప్రతి శుక్రవారం కోర్టుకు రావాల్సిందే
posted on Jan 3, 2020 @ 4:29PM
అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ కోర్టుకు తప్పకుండా హాజరు కావాలని హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఏ1, ఏ2 నిందితులు ప్రతి శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిందేనని మినహాయింపు ఇవ్వటం కుదరదని జగన్ తరఫు లాయర్‌కు సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.. ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు జరిగిన అనంతరం.. ఏ1, ఏ2 నిందితులుగా ఉన్న జగన్, విజయసాయిరెడ్డి కోర్టుకు హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈనెల 10న విచారణకు హాజరై తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. నేరానికి, హోదాకు సంబంధం లేదని కోర్టు పేర్కొంది.