బోస్టన్ కమిటీ నివేదిక పై సర్వత్రా ఉత్కంఠత...
posted on Jan 3, 2020 @ 1:28PM
ఆంధ్రపదేశ్ రాజధాని పై తీవ్ర ఉత్కంఠత నెలకొన్నది.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అలాగే కొనసాగుతుందా లేక మరో ప్రాంతం రాజధానిగా మారుతోందా, ప్రభుత్వం చెబుతున్నట్టుగా మూడు ప్రాంతాలనూ రాజధానులుగా చేస్తుందా అని తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు రాజధాని ప్రజలు.బోస్టన్ కమిటీ ఇవాళ ఏమని నివేదిక నివ్వబోతోంది,దానిపై ఏపీ క్యాబినెట్ ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందన్న విషయం కూడా ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధానుల పై జియన్ రావు కమిటీ పలు సూచనలు చేసింది. 8 న జరిగే క్యాబినెట్ లో ఏ నిర్ణయం తీసుకుంటారు లేక మరోసారి భేటీ అయ్యి తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.అమరావతిని తరలించడం పై ఆ ప్రాంత రైతులు ఇప్పటికే ఆందోళనలు కొనసాగిస్తుంటే విశాఖ, కర్నూలులో మాత్రం స్వాగతిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాజధానుల పై రగులుకున్న వివాదం సజ్జమనచేయటంలో కమిటీల మీద కమిటీలు వేసినా ఏపీ ప్రభుత్వం వాటి ఆధారంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది అందర్నీ తొలుస్తున్న ప్రశ్న. కమిటీల నిర్ణయాల ఆధారంగా మంత్రివర్గం ఒక డెసీషన్ తీసుకుంటోందని ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా తెలిసిన నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వానికి ఇవ్వనున్న బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక ఎలా ఉండబోతుంది అన్నది చర్చ నీయాంశంగా మారింది.మరోవైపు పదిమంది మంత్రులూ ఉన్నతాధికారులతో వేసిన హైపవర్ కమిటీ రెండు నివేదికలను అధ్యయనం చేస్తోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి వికేంద్రీకరణపై సూచనలు కూడా చేసి 20 లోగా నివేదికను సమర్పిస్తుంది. ఇందులో ఉన్న సూచనలు సలహాల ఆధారంగా ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణతో పాటు ఆయా ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకొనున్నట్లు సమాచారం. బోస్టన్ రిపోర్ట్ కూడా వికేంద్రీకరణకు అనుకూలంగా ఉంటే హైపవర్ కమిటీ ఇచ్చే సూచనలు కీలకం కానున్నాయి. మూడు వారాల్లగా నివేదిక ఇవ్వాలని హైపవర్ కమిటీని ఆదేశించిన నేపథ్యంలో వాటి సూచనల ఆధారంగా తీసుకునే నిర్ణయాలే కీలకం కానున్నాయి.