ఆందోళనకరంగా మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి!?
posted on Feb 21, 2025 @ 12:00PM
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడుతున్న మాగంటి గోపీనాథ్ గత కొద్ది రోజులుగా ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం (ఫిబ్రవరి 21) ఆయన ఆరోగ్యం క్షీణించిందని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
బంధువుల కథనం ప్రకారం మాగంట గోపీనాథ్ ఆరోగ్య పరిస్థతి గత నాలుగు రోజుల నుంచీ ఆందోళనకరంగా ఉంది. అయితే ఆస్పత్రి వర్గాల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. గాగా గురువారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్రం కేసీఆర్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. దీంతో అంతా మాగంటి గోపానాథ్ ను పరామర్శించడానికే కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లారని భావించారు. అయితే కేసీఆర్ తన జనరల్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లారు తప్ప మాగంటను పరామర్శించడానికి కాదని ఈ తరువాత తెలిసింది.