తిప్పతీగ.. ఇలా వాడి చూడండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!
posted on Jan 5, 2026 @ 1:37PM
తిప్పతీగ గురించి ఈ మధ్యకాలంలో చాలా సమాచారం వ్యాప్తి అవుతోంది. ఒకప్పుడు గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా పెరిగేవి తిప్పతీగ మొక్కలు. ఇప్పుడు ఇళ్ళలో పెంచుకోవడం లేదా ఆన్లైన్ లో తిప్పతీగ పొడర్స్ లాంటివి కొనడం చేస్తుంటారు. అయితే తిప్పతీగను సరైన విధానంలో వాడటం ద్వారా చాలా రకాల ఆరోగ్య సమస్యలు దూరంగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అసలు తిప్పతీగలో ఉండే పోషకాలు ఏంటి? ఇది ఏ వ్యాధులకు ప్రయోజనకరంగా ఉంటుంది?తెలుసుకుంటే..
తిప్పతీగలో ఉండే పోషకాలు..
తిప్పతీగలో కాల్షియం, భాస్వరం, ఐరన్, రాగి, మాంగనీస్, జింక్, విటమిన్-సి, బీటా-కెరోటిన్, ప్రోటీన్, ఫైబర్, కార్బోహేడ్రేట్లు, కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు అన్నీ ఉంటాయి.
తిప్పతీగ ప్రయోజనాలు..
రక్తహీనత..
మహిళలలో రక్త హీనత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే తిప్పతీగను తీసుకుంటే చాలా మంచి బెనిపిట్స్ ఉంటాయి. తిప్పతీగలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది. ఇది రక్త నష్టాన్ని భర్తీ చేయడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి..
శీతాకాలంలో రోగనిరోధక శక్తి బాగా బలహీనం అవుతుంది. రోగనిరోధక శక్తి తిరిగి బలంగా మారడానికి, శీతాకాలపు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి రోజూ తిప్పతీగ తీసుకుంటే చాలా మంచిది. తిప్పతీగ లోని విటమిన్-సి రోగనిరోధక శక్తిని బలపరచడంలో సహాయపడుతుంది.
పొట్ట సమస్యలు..
పొట్ట సమస్యలతో ఇబ్బంది పడేవారు తిప్పతీగ వాడితే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. తిప్పతీగలో ఫైబర్ కంటెంట్ మెరుగ్గా ఉంటుంది. ఇది పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. రోజూ తిప్ప తీగ తీసుకుంటూ ఉంటే కొన్ని రోజులోనే స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి.
ఎముకలు..
తిప్పతీగలో కాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది. అందుకే ప్రతి రోజూ తిప్పతీగ తీసుకుంటే కాల్షియం మెరుగ్గా అందుతుంది. ఎముకలు బలంగా మారతాయి.
తిప్పతీగతో జాగ్రత్త..
తిప్పతీగ తినడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఏదైనా మితంగా తీసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది. అలాగే తిప్పతీగ కూడా పరిమితంగా తీసుకోవాలి. ఎక్కువ తిప్ప తీగ తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలకు బదులు ఆరోగ్యానికి హాని ఎదురవుతుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...