సిర్పూర్ కాంగ్రెస్ కు బిగ్ షాక్... ఏడాది కాకముందే కోనేరు కోనప్ప రాజీనామా
posted on Feb 21, 2025 @ 4:55PM
బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిర సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఏడాది తిరక్కుండానే ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీతో విభేధాలు తలెత్తడం వల్ల కోనేరు కోనప్ప రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరైన ప్లై ఓవర్ బ్రిడ్జిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో కోనేరు కోనప్ప రాజీనామా చేశారు. 2014లో కోనేరు కోనప్ప బిఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత పార్టీ ఫిరాయించి కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ లో చేరారు. 2023 ఎన్నికల్లో బిఆర్ ఎస్ నుంచి సిర్పూర్ ఎమ్మెల్యేగా పోటీచేసి బిజెపి చేతిలో ఓడిపోయారు. ఓటమి తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఏడాది తిరక్కుండానే కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.