ఆ వ్యక్తి జీవితం స్పూర్తి దాయకం: చంద్రబాబు
posted on Feb 21, 2025 @ 4:02PM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టును షేర్ చేశారు. . ఓ వ్యక్తి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎన్నో దశాబ్దాల కిందట హైదరాబాద్ కు వలసవెళ్లి అక్కడే వెదురు బుట్టలు, విసనకర్రలు, కొబ్బరి ఆకులతో పలు ఉత్పత్తులు తయారు చేస్తూ జీవించేవాడు. దీన్ని హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ అనే సోషల్ మీడియా హ్యాండిల్ పోస్టు చేసింది.కష్టించి పనిచేసే స్వభావం, ఏపీ వాణిజ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని తెలిపారు. కానీ, అతడు సొంతగడ్డను వదిలి అవకాశాలను వెతుక్కుంటూ వేరే ప్రాంతానికి వెళ్లడం తనను విచారానికి గురిచేసిందని చంద్రబాబు పేర్కొన్నారు ప్రస్తుతం ఈ వ్యక్తి హైద్రాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఈ ఉత్పత్తులు విక్రయిస్తున్నాడు