దేశంలోనే అతిపెద్ద జప్తు
posted on Oct 19, 2012 @ 3:37PM
సత్యం కుంభకోణం కేసు దేశాన్ని దిమ్మర పోయేట్లుగా చేసింది. తప్పుడు లెక్కలతో భ్యాంకు నుండి 2000 కోట్లు అప్పు తెచ్చారని, వాటిని కుటుంబ సభ్యుల ఖాతాలో ఉంచారని సిబిఐ చెబుతుంది. మహేంద్రాసత్యం ఖాతాలలోని 822 కోట్లనగదును ఎన్ ఫోర్సమెంట్ డైరెక్టరేట్ గురువారం జప్తు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులను జప్తు చేయటం దేశంలో ఇదే ప్రధమం. అలాగే రెండు నెలల క్రితం రామలింగరాజుకు చెందిన 120 కోట్ల విలువైన ఆస్తులకు అటాచ్ మెంట్ సిబిఐ కోర్టుకు అనుమతినిచ్చింది. ఈ తీర్పుతో అక్రమార్జనుల గుండెల్లో గుబులు పెడుతుంది. ఇప్పుడు కోర్టులు అత్యంత ధైర్యం ప్రదర్శించాయి. ఇదే విధంగా దేశం మొత్తం మీద జరిపితే ఇంకెంత మొత్తం వస్తుందో అని ప్రజలు నోరెళ్ల బెడుతున్నారు. సత్యం నాగరాజు, కుటుంబసభ్యులందరికీ కలిపి 1063 కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలుస్తుంది. వీటన్నిటికి కలిపి అటాచ్ మెంటుకు కోర్టు సిబిఐ కి అనుమతి ఇచ్చింది. సత్యం రామలింగరాజుకు ఆంధ్రప్రదేశ్ పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో ఆయనకు, కుటుంబసభ్యులకు ఆస్తులున్నట్లు సిబి ఐ గుర్తించింది.