చీమలేటిపల్లెకి గబ్బిలాలే వరం
posted on Oct 19, 2012 9:29AM
గబ్బిలాలు ఎంత ఎక్కువ తిరిగితే అంత అభివృద్ధి జరుగుతుందని ప్రకాశం జిల్లా చీమలేటిపల్లె వాసులంటున్నారు. గబ్బిలాలు ఉండటం వల్ల చీమలబెడద, దోమల బెడద, పంటపై చీడపీడల బెడద వంటివి లేవని ఆ గ్రామస్తులు అంటున్నారు. ప్రత్యేకించి గబ్బిలాలు తమ గ్రామానికి పట్టిన అదృష్టంగా కూడా వీరు చెప్పుకుంటున్నారు. ఇటీవల కాలుష్యం వల్ల గబ్బిలాలు తగ్గుతున్నాయి వీరు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటిదాకా తమను ఈ గబ్బిలాలు తపస్సు పక్షుల్లా కాపాడాయని వీరు చెబతున్నారు. తమ పంటదిగుబడి పెరగటానికి కూడా గబ్బిలాలే కారణమని వీరు స్పష్టం చేస్తున్నారు. పదేళ్ల క్రితం లక్షల సంఖ్యలో ఉన్న గబ్బిలాలు ఇప్పుడు వేల సంఖ్యకు పడిపోయాయంటున్నారు. అయితే తాజాగా పక్షవాతాన్ని నయం చేయడానికి పనికొచ్చే మందుని గబ్బిలాలతో తయారుచేయొచ్చంటూ వాటిని పట్టుకోవడానికొచ్చిన వేటగాళ్లని గ్రామస్తులు తరిమికొట్టారు. జీవవైవిధ్యానికి గబ్బిలాలు నిదర్శనంగా నిలుస్తున్నాయని, ఎవరైనా గబ్బిలాల సంఖ్య పెంచే సూత్రం చెబితే తాము అనుసరిస్తామని ఈ గ్రామస్తులు అంటున్నారు.